సీనియర్ సినీ నటుడు నరేష్ తన వ్యక్తిగత విషయాల ద్వారా తరచూ వార్తల్లో నిలుస్తున్నారు.ఇలా ఈయన నటి పవిత్ర లోకేష్ తో రిలేషన్ లో ఉండడమే కాకుండా ఇద్దరు సహజీవనం చేయడంతో వీటి వ్యవహారం గురించి తరచూ ఏదో ఒక వార్త వైరల్ అవుతూనే ఉంది.
ఇలా నరేష్ పవిత్ర వ్యవహార శైలి కారణంగా ఈయన పలుమార్లు పోలీసులను కూడా ఆశ్రయించారు.ఇకపోతే తాజాగా నరేష్ తమ గురించి తప్పుడు వార్తలు పిచ్చి రాతలు రాయడంతో మీడియాపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.
పలు మీడియా సంస్థలు పదేపదే తన వ్యక్తిగత విషయాలకు సంబంధించిన వార్తలను రాస్తూ వారిపై ట్రోల్ చేయడంతో నరేష్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.తన జీవితంలోకి పవిత్ర లోకేష్ ను కొత్తగా ఆహ్వానించడంతో ఇదే అదునుగా భావించిన కొన్ని పేరు లేనటువంటి మీడియా సంస్థలు కూడా ఇష్టం వచ్చిన విధంగా తమ గురించి ట్రోల్స్ చేస్తున్నారని ఈయన మండిపడ్డారు.చివరికి తాము బెడ్ రూమ్ బాత్రూంలో మాట్లాడుకున్నట్టుగా కూడా తప్పుడు వార్తలను సృష్టిస్తున్నారని, ఇలా తమ పరువు తీస్తున్నటువంటి కొందరు ట్రోలర్స్, మీమర్స్ , ఎవరో గుర్తించి పక్క సాక్షాధారాలతో పోలీసులకు అప్పగించామని తెలిపారు.
ప్రతి ఒక్కరి జీవితంలోను వ్యక్తిగత విషయాలు ఉంటాయి.అయితే తమ వ్యక్తిగత విషయాలను అడ్డుపెట్టుకొని కొన్ని మీడియా సంస్థలు డబ్బు సంపాదించుకుంటున్నారని,త్వరలోనే ఆ మీడియా సంస్థలపై చర్యలు ఎలా ఉంటాయనే విషయాలను తాను తెలియజేయబోతున్నానని నరేష్ మీడియాకి కూడా వార్నింగ్ ఇచ్చారు.ఇలా తనను అగౌరవపరిచే విధంగా మాట్లాడుతున్నటువంటి మీడియా సంస్థలపై పరువు నష్టం దావా వేస్తానని కూడా ఈయన వెల్లడించారు.
ఈ క్రమంలోనే నరేష్ చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.