తెలంగాణ ప్రభుత్వంపై బీజేపీ ఎంపీ లక్ష్మణ్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.అసెంబ్లీ సమావేశాలను బీఆర్ఎస్ వేదికగా మార్చుకున్నారని మండిపడ్డారు.
తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావులు పోటీపడి మోదీని విమర్శించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.ప్రజా సమస్యలపై మాత్రం అసెంబ్లీలో చర్చ జరగలేదన్నారు.
గతంలో కేంద్రమంత్రిగా కేసీఆర్ ఎన్ని నిధులు తెచ్చారని ప్రశ్నించారు.కాంగ్రెస్, బీఆర్ఎస్ లు వేరు కాదన్నారు.
సెక్రటేరియట్ కు రాని సీఎంకు కొత్త సచివాలయం అవసరమా అని నిలదీశారు.బీసీల అభివృద్ధి కోసం కేంద్రం పని చేస్తోందని స్పష్టం చేశారు.