ఇలియానాకు అసలేమయ్యింది.. హాస్పిటల్ బెడ్ పై అలాంటి స్థితిలో?

తెలుగు సినీ ప్రేక్షకులకు ఒకప్పటి హీరోయిన్,గోవా బ్యూటీ ఇలియానా గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.మొదట దేవదాసు సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఇలియానా మొదటి సినిమాతోనే మనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరుచుకుంది.

 Actress Ileana Dcruz Hospitalised Photos Goes Viral ,ileana Hospitalised, Tolly-TeluguStop.com

ఇక ఈ సినిమా తర్వాత పూరి జగన్నాథ్ దర్శకత్వంలో పోకిరి సినిమాలో నటించి బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకుంది.ఈ సినిమా తర్వాత వరుసగా సినిమా అవకాశాలు అందుకుంటూ టాప్ హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది.

ఇక తెలుగులో ఎన్నో సినిమాలలో నటించి స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్న ఇలియానా, కేవలం తెలుగులోనే కాకుండా బాలీవుడ్ లో కూడా పలు సినిమాలలో నటించింది.ఆ తర్వాత ఇండస్ట్రీకి ఒక్కసారిగా దూరమైందీ ఇలియానా.

అయితే ప్రస్తుతం ఈమె ఆడపాదపా సినిమాలలో నటిస్తోంది.సినిమాలలో నటించకపోయినప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తన అభిమానులతో ముచ్చటిస్తూ ఉంటుంది.

Telugu Goa Ileana, Ileana, Tollywood-Movie

తనకు సంబంధించిన ఫోటోలను,వీడియోలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.ఈ నేపథ్యంలో తాజాగా ఇలియానా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసిన ఫొటోలను చూసి అభిమానులు ఆమె ఫ్యాన్స్‌ను ఒక్కసారిగా షాక్‌ అయ్యారు.చేతికి సెలైన్‌తో ఆసుపత్రి బెడ్‌పై పడుకున్న ఇలియానా ఫొటోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి.

Telugu Goa Ileana, Ileana, Tollywood-Movie

ఈ ఫొటోలతో పాటు తాను ఆహారం తీసుకోలేని స్థితి ఉండగా వైద్యులు మూడు బాటిళ్ల సలైన్స్‌ ఎక్కించినట్లు రాసుకొచ్చింది.ఇక మరో ఫొటోతో పాటు ఒక్క రోజులో ఎంత మార్పు అంటూ చేతికి సలైన్‌ ఎక్కిస్తున్న ఫొటోని అభిమానులతో పంచుకుంది.అయితే ఏం జరిగిందో అని అభిమానులు ఆందోళన చెందడంతో వారిని ఉద్దేశిస్తూ మరొక పోస్ట్ కూడా చేసింది.అందులో డాక్టర్లు బాగా చికిత్స అందిస్తున్నారు.3 బ్యాగ్స్‌ ఐవీ లిక్విడ్స్‌ ఇచ్చారు.అందరూ నా ఆరోగ్యం గురించి ఆరా తీస్తున్నారు.ఇంతగా నాపై ప్రేమ, అప్యాయత చూపిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞుతురాలిని.ఇప్పుడు నేను బాగానే ఉన్నాను.నాకు మంచి వైద్యం అందుతోంది అని రాసుకొచ్చింది.

దాంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube