తెలంగాణ నూతన సీఎస్‌గా శాంతికుమారి నియామకం అయ్యారు.ఈ మేరకు మరికాసేపట్లో తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయనుంది.
సీఎస్ సోమేశ్ కుమార్ కేటాయింపును రద్దు చేస్తూ, ఏపీ క్యాడర్ కు వెళ్లాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలో తెలంగాణ నూతన సీఎస్ ఎంపికపై సీఎం కేసీఆర్ మంత్రులతో సమావేశం అయ్యారు.
ఈ సమావేశంలో కొత్త సీఎస్ గా శాంతికుమారిని నియమిస్తూ కీలక నిర్ణయం తీసుకోన్నారని సమాచారం.కాగా శాంతికుమారి ప్రస్తుతం అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బాధ్యతలు నిర్వహిస్తున్నారు.