అందరిలాగా విజయ్ కేరవాన్ వాడరు.... శ్రీకాంత్ కామెంట్స్ వైరల్!

కోలీవుడ్ హీరో విజయ్ దళపతి హీరోగా రష్మిక హీరోయిన్ గా సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం వారసుడు.తమిళంలో వరిసు పేరుతో తెరకెక్కిన ఈ సినిమాని తెలుగులో వారసుడు పేరిట ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

 Vijay Doesnt Use Caravan Like Everyone Else Srikanths Comments Are Viral , Vija-TeluguStop.com

ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్స్ పీవీపీ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మించిన విషయం మనకు తెలిసిందే.ఇక ఈ సినిమా కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

ఈ సినిమా జనవరి 12వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఇందులో నటించిన తెలుగు సీనియర్ నటుడు శ్రీకాంత్ ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.

ఈ ఇంటర్వ్యూ సందర్భంగా శ్రీకాంత్ సినిమా గురించి అలాగే హీరో విజయ్ గురించి పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు.హీరో శ్రీకాంత్ వారసుడు సినిమా గురించి మాట్లాడుతూ ఇందులో తాను విజయ్ కి అన్నయ్య పాత్రలో కనిపిస్తానని ఈ సినిమాలో మొదటి నుంచి చివరి వరకు తాను కనిపిస్తానని తెలిపారు.

ఇలా అద్భుతమైన ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన చిత్రం ద్వారా తాను తమిళ్ ఎంట్రీ ఇవ్వడం చాలా ఆనందంగా ఉందని తన కెరియర్ లోనే మొదటిసారి ఇలా తమిళ సినిమాలో నటించానని తెలిపారు.

Telugu Caravan, Dil Raju, Kollywood, Srikanth, Tollywood, Varasudu, Vijay-Movie

ఇకపోతే హీరో విజయ్ గురించి మాట్లాడుతూ తనని ఇదివరకు ఫంక్షన్లలో కలిశాను తప్ప తనతో కలిసి నటించడం ఇదే మొదటిసారని తెలిపారు.షూటింగ్ లొకేషన్లోకి వచ్చిన తర్వాత చాలా అంకితభావంతో పనిచేస్తారని శ్రీకాంత్ పేర్కొన్నారు.విజయ్ ఎక్కువగా ఎవరితోనూ మాట్లాడరు ఆయన షూటింగ్ లొకేషన్లోకి వచ్చారు అంటే తన సెల్ ఫోన్ కూడా తన పక్కన ఉండదని అలాగే అందరికి హీరోల మాదిరిగా షాట్ పూర్తి కాగానే ఆయన కేరవాన్ లోకి వెళ్లి కూర్చోరు.

అసలు తాను క్యారవాన్ ఉపయోగించరని,ఉదయం లొకేషన్ లోకి అడుగుపెట్టిన తర్వాత సాయంత్రం ప్యాకప్ చెప్పే వరకు అక్కడే ఉంటారంటూ శ్రీకాంత్ హీరో విజయ్ గురించి చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube