వైకుంఠ ఏకాదశి రోజు సాయంత్రం ఈ పూజ చేస్తే.. ఆర్థిక సమస్యలు దూరం అయిపోతాయా..

హిందూ సంప్రదాయం ప్రకారం వైకుంఠ ఏకాదశికి ఎంతో విశిష్టత ఉంది.నెలలో వచ్చే రెండు ఏకాదశి తిధుల్లో ఉపవాసం కూడా ఉంటారు.

 If This Pooja Is Performed In The Evening Of Vaikuntha Ekadashi. Will Financial-TeluguStop.com

ఇంకా చెప్పాలంటే సంవత్సరానికి 24 ఏకాదశులలో వైకుంఠ ఏకాదశి ఎంతో విశిష్టత ఉంది.కోటి పుణ్యాలకు సాటి ఒక ముక్కోటి ఏకాదశి అని కూడా చెబుతూ ఉంటారు.

సూర్యుడు ధనస్సు రాశిలో ప్రవేశించిన తర్వాత నుంచి మకర రాశి సక్రమణం వరకు జరిగే సమయంలో ముక్కోటి ఏకాదశి వస్తుంది.ఈరోజున వైకుంఠ వాకిట్లో తెరుచుకుని ఉంటాయని చాలామంది భక్తులు నమ్ముతారు.

అందుకే ఈరోజున వైష్ణవ దేవాలయాలలో గల ఉత్తర ద్వారం నుంచి భక్తులు భగవంతుని దర్శించుకుంటారు.శేషా తల్పం మీద శయనించి ఇచ్చే విష్ణు మూర్తిని దర్శించుకోవడానికి తరలి వెళ్లే ముక్కోటి దేవతలతో కలిసి స్వామి భూలోకానికి వచ్చే శుభ సందర్భంగా ఈ వైకుంఠ ఏకాదశి అని పెద్దవారు చెబుతూ ఉంటారు.

పరమ పవిత్రమైన ఈ రోజున ఉత్తర ద్వార దర్శనంతో స్వామి దర్శించుకుంటే జన్మజన్మల పాపాలు తొలగిపోయి పుణ్యా లోకాలు ప్రాప్తిస్తాయని వేద పండితులు చెబుతున్నారు.ముక్కోటి ఏకాదశి రోజున ఉదయమే విష్ణుమూర్తి దర్శనం చేసుకుని ఆ తర్వాత పూజ చేసి ఆ రోజంతా ఉపవాసం ఉంటే అఖండ ఐశ్వర్యం లభిస్తుందని చాలామంది భక్తులు విశ్వసిస్తారు.

ఇంకా చెప్పాలంటే ముక్కోటి ఏకాదశి రోజున ఆ విష్ణుమూర్తిని నియమా నిష్ఠత్లతో పూజ చేసి ఏకాదశి వ్రతమాచరించే వారికి మోక్షం లభిస్తుందని పండితులు చెబుతున్నారు.ముక్కోటి ఏకాదశి రోజు చేసే విష్ణు పూజ, గీతా పారాయణం, గోవింద నామ స్మరణం, పురాణ శ్రావణం వంటివి భక్తులకు మోక్షాన్ని ప్రసాదిస్తాయని చెబుతున్నారు.

ఒకవేళ ఎవరికైనా ఇవన్నీ చేయడానికి వీలు లేకపోతే వారు ఓం నమో నారాయణ అనే మంత్రాన్ని 108 సార్లు జపించడం వల్ల తమకున్న సమస్యలన్నీ దూరమైపోతాయని చెబుతున్నారు.

Telugu Devotional, Lord Shiva, Lord Vishnu, Mukkoti Ekadasi-Latest News - Telugu

ఈ సంవత్సరం ముక్కోటి ఏకాదశికి ఇంకొక విశిష్టత ఉంది.అది ఏమిటంటే సోమవారం రోజున ముక్కోటి ఏకాదశి వచ్చింది.కాబట్టి సోమవారం శివుడికి ఎంతో ఇష్టమైన రోజు.

ముక్కోటి ఏకాదశి శ్రీ మహావిష్ణువుకు ఎంతో ఇష్టమైన తిధి.ఇలా ఒకేరోజు హరిహరులకు ఇష్టమైనది కావడంతో ఈ ముక్కోటి ఏకాదశి మరింత విశిష్టత మైనదిగా చాలామంది ప్రజలు భావిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube