ఒకప్పటి సీనియర్ నటుడు చంద్రమోహన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.తెలుగులో ఎన్నో అద్భుతమైన సినిమాలలో విభిన్నమైన పాత్రలో నటించి మెప్పించారు చంద్రమోహన్.
మొదటి రంగులరాట్నం సినిమాతో తన సినీ ప్రస్తావాన్ని మొదలుపెట్టిన చంద్రమోహన్ దాదాపుగా 175 పైగా సినిమాలలో హీరోగా నటించి మెప్పించారు.అలాగే తెలుగులో మొత్తం తొమ్మిది వందలకు పైగా సినిమాలలో నటించి మెప్పించారు.
ఇక ఆయనకు వచ్చిన అవార్డులు రివార్డుల గురించి అయితే ప్రత్యేకంగా పరిచయం చెప్పాల్సిన పనిలేదు.
ఇది ఇలా ఉంటే తాజాగా ఒక ప్రముఖ మీడియా ఛానల్ వారు నటుడు చంద్రమోహన్ హోమ్ టూర్ ని చేయడంతో పాటు ఆయనని ఆయన భార్యని ఇతని కలిసి ఇంటర్వ్యూ చేశారు.
ఈ ఇంటర్వ్యూలో భాగంగా చంద్రమోహన్ ఎన్నో విషయాలను తెలిపారు.చంద్రమోహన్ తన జ్ఞాపకాలను గుర్తు చేసుకోవడంతో పాటు తన ఇంటి విశేషాల గురించి పంచుకున్నారు.అలాగే తన సతీమణి జలంధరను పరిచయం చేశారు చంద్రమోహన్.చాలా కాలం తర్వాత ఆమె మీడియా ముందుకు వచ్చారు.
ఆమె మంచి రచయిత్రి.ఈ దంపతులకు ఇద్దరు అమ్మాయిలు.
ఈ నేపథ్యంలోనే చంద్రమోహన్ భార్య జలంధర మాట్లాడుతూ.ఆయన నటించిన అన్ని చిత్రాలు నచ్చుతాయి.
ఒకప్పుడు ఆయనతో నటించడానికి ఎంతో మంది హీరోయిన్లు ఉత్సాహం చూపించేవారు.ఆయన లక్కీ హీరోగా ఇండస్ట్రీలో టాక్ ఉంది.ఆయన సతీమణిగా నాకు కూడా ఎంతో అదృష్టం కలిసి వచ్చింది.ఆయన చేత్తో ఒక్క రూపాయి తీసుకుంటే ఎంతో కలిసి వస్తుందని అంటారు.ఇప్పటికి జనవరి ఫస్ట్ కు ఎంతో మంది వస్తుంటారు.ఆయన చేత్తో నాకు డబ్బు ఇవ్వడం వల్లనే నాకు మంచి స్టార్ రైటర్ గా పేరు వచ్చింది అని తన భర్త గురించి ఎంతో గొప్పగా చెప్పుకొచ్చింది జలంధర.
అయితే జలంధర మాట్లాడుతుండగా చంద్రమోహన్ కన్నీళ్లు పెట్టుకున్నారు.ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.