మనదేశంలో చాలామంది ప్రజలు కార్తీక మాసంలో నే కాకుండా కొన్ని ప్రతిక్యమైన పండుగలలో కఠినమైన ఉపవాస దీక్షలు చేస్తూ ఉంటారు.అలా ఉపవాసం చేయడం వల్ల వారి ఇంట్లో ఉన్న చాలా రకాల సమస్యలు తగ్గిపోతాయని చాలామంది ప్రజల నమ్మకం.
మరి కొంతమంది కొన్ని పండుగల సందర్భంగా కొన్ని వారాలలో కూడా ఉపవాస దీక్షను పాటిస్తూ ఉంటారు.అలాంటి మోస దీక్షలలో శుక్రవారం రోజు శ్రీ మహాలక్ష్మి దేవి కోసం ఉపవాస దీక్ష చేస్తే వారి ఇంట్లో ధన లాభం ఉంటుందని చాలా మంది భక్తులు నమ్ముతారు.
అలాగే ఆర్థిక సమస్యలు తొలగిపోయి ఆ ఇంట్లో సంపదలతో అష్టైశ్వర్యాలు కలుగుతాయని వేద పండితులు చెబుతారు.
ఇంకా చెప్పాలంటే ఆరోజు లక్ష్మీదేవిని పూజించడం, ఉప్పును, పసుపును కొన్ని తెచ్చుకోవడం కూడా ఎంతో మంచిది.
శుక్రవారం రోజు సూర్యోదయానికి ముందే నిద్ర లేచి ఇంటిని శుభ్రం చేసుకోవడం ఎంతో ఉత్తమమైన పని.శుక్రవారం పూట లేదా రోజూ కొద్దిపాటి అన్నాన్ని శేషంగా ఓ చిన్నపాటి గిన్నెలో వుంచి వంటింట్లో వుంచడం సంప్రదాయం.ఇలా చేయడం వల్ల దేవతలు వారి ఇంట్లో ఎప్పుడూ ధాన్యం ఉండుగాక అని దీవిస్తారట.శుక్రవారం రోజు నుదుటన బొట్టు పెట్టుకునే వారికి కలకాలం సౌభాగ్యం నిలిచే ఉంటుందట.
ఇంకా స్టిక్కర్లను నుదుట ధరించకుండా తెల్ల వక్కలతో తయారైన కుంకుమను శుక్రవారం ధరిస్తే మహాలక్ష్మీదేవి అనుగ్రహం ఎప్పుడూ ఉంటుంది.
శుక్రవారం రోజు తెల్లని వస్త్రాలను ధరించడం చాలా రోజులను చేస్తున్న నియమం.తెల్లని వస్త్రాలంటే శుక్రునికి, మహాలక్ష్మీకి ఎంతో ఇష్టం.శుక్రవారం రోజు తెల్లని దుస్తులను ధరిస్తే మహాలక్ష్మీ దేవి ఆ ఇంటిపై అనుగ్రహం ఎప్పుడూ ఉంటుంది.
అయితే శుక్రవారం వర్జ్యం వున్న సమయంలో మౌనవ్రతం పాటించినా ఆ ఇంట ఎంతో ధన సమృద్ధి కలుగుతుందని పండితులు చెబుతున్నారు.
GENERAL-TELUGU