ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలలో ప్రజలు దేవాలయాలకు వెళుతూ ఉంటారు.ముఖ్యంగా భారతదేశంలో ఉన్న చాలా దేవాలయాలకు ఎన్నో సంవత్సరాల పూర్వ చరిత్ర ఉంది.
అంతేకాకుండా భారతదేశంలో ఉన్న ఒక్కొక్క దేవాలయంలో భక్తులు ఒక్కోరకంగా వచ్చి పూజలు చేస్తూ ఉంటారు.భక్తుల విశ్వాసం, భక్తితో పాటు భగవంతుని లీలలు, అద్భుతాలు నేటికీ భారతదేశంలోని దేవాలయాల్లో కనిపిస్తాయి.
మథురలోని బృందావంధామలోని ఏడు దేవాలయాలలో ఒకటైన రాధారామన్ దేవాలయం ఎన్నో దశాబ్దాల నాటిది.అద్భుతమైన ఈ దేవాలయానికి సంబంధించిన విషయాలు ఎప్పుడూ చర్చల్లోనే నిలుస్తూ ఉంటాయి.
ఐదు శతాబ్దాలుగా అక్కడ భగవంతుని అద్భుతం, అద్వితీయమైన లీల కొనసాగుతోంది.ఇక్కడి ఆయల ఆవరణలో భగవంతుడి ప్రసాదాలు తయారు చేసేందుకు గత 480 సంవత్సరాలుగా కొలిమి ఎప్పుడు మండుతూనే ఉంటుంది.
ఈ అగ్ని నుండి వెలువడే జ్వాలా ఈ దేవాలయంలోని దీపం హారతి నైవేద్యాల వరకు ఉపయోగపడుతుంది.ఈ దేవాలయంలోని ప్రాంగణంలో ఉన్న ఈ పురాతన కొలిమి రోజంతా మండుతూనే ఉంటుంది.
దేవుని కార్యక్రమాలన్నీ పూర్తి అయిన తర్వాత కూడా రాత్రిపూట ఈ అగ్ని చల్లబడకుండా పైనుండి బూడిద కప్పి ఉంచుతారు.ఆ తర్వాతి రోజు ఉదయం అవే మంటలలో ఆవు పేడ పిడకలు ఇతర కట్టలు వేసి మిగిలిన భట్టిలను వెలిగిస్తారు.
ఈ ఆచారం ఐదు దశాబ్దాల క్రితం నుంచి అలానే వస్తూ ఉంది.ఈ పవిత్రమైన అఖండ జ్యోతి నుండి పొందిన అగ్నిజ్వాలతో దీపాలు మరియు దేవుడికి ఇచ్చే హారతిని కూడా వెలిగిస్తారు.
ఆ దేవాలయం లో లైటర్ కానీ అగ్గిపెట్ట కానీ ఎప్పుడూ వాడరు.కొలిమి మంట నుండి వచ్చే అగ్నిని మాత్రమే వాడుకుని భగవంతుని నైవేద్యాలు చేయడానికి ఉపయోగిస్తారు.
ఈ దేవాలయం లోని వంటగదిలోకి బయటి వ్యక్తులకు నిషేధించబడింది.ఈ ఆలయ సేవకుడికి ధోతి తప్ప వేరే బట్టలు ఉండవు.
వంట గదిలోకి వెళ్లిన తర్వాత, ప్రసాదం మొత్తం చేసిన తర్వాతే బయటకు వస్తారు.