మునుగోడు ఉపఎన్నికల్లో గెలుపు కోసం టీఆర్ఎస్ ప్రజలను ప్రలోభాలకు గురి చేసిందని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు.అయినా టీఆర్ఎస్ కు ఆదరణ లేదని, వామపక్షాలు లేకపోతే కనీసం డిపాజిట్లు కూడా రావని విమర్శించారు.
ఉపఎన్నిక ఫలితాల వెల్లడి ఆలస్యంపై పలు అనుమానాలు ఉన్నాయన్నారు.టీఆర్‌ఎస్ ఓడితే పెన్షన్లు రద్దు అవుతాయని మంత్రులు బెదిరించారని ఆరోపించారు.
ప్రత్యర్థులు ప్రచారం చేయకుండా దౌర్జన్యానికి పాల్పడ్డారన్నారు.అదేవిధంగా పోలింగ్ సిబ్బందిని సైతం ప్రలోభ పెట్టే ప్రయత్నం చేశారని పేర్కొన్నారు.
సీఎం కేసీఆర్ స్వయంగా ఎమ్మార్వో, ఎండీవోలతో మాట్లాడే స్థాయికి దిగజారారని మండిపడ్డారు.
.