వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర మహాసభలు జయప్రదం కోరుతూ ఇంటా ఇంటా విరాళాలు సేకరణ...

డిసెంబర్ నెలలో ఖమ్మం నగరంలో జరగబోయే వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర మహాసభలు జయప్రదం చేయాలని కోరుతూ ఖమ్మం టూ టౌన్ ఆధ్వర్యంలో మంగళవారం రేవతి సెంటర్ ఏరియాలో ఇల్లు ఇల్లు తిరిగి మాస్ ఫండ్ చేయడం జరిగింది.ఈ సందర్భంగా నాయకులు కళ్యాణం వెంకటేశ్వరరావు, వై విక్రమ్ లు మాట్లాడుతూ వ్యవసాయ కార్మికుల సమస్యలపై నిరంతరం రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేసి వ్యవసాయ కార్మికుల పట్ల అండగా సంఘం నిలబడింది అని తెలిపారు.

 The State Congresses Of The Agricultural Labor Union Are Asking For Jayapradham-TeluguStop.com

డిసెంబర్ మొదటి వారంలో ఖమ్మం నగరంలో రాష్ట్ర మహాసభలు జరగబోతున్నాయని, ఈ మహాసభలకు ముఖ్య అతిథిగా కేరళ రాష్ట్ర ముఖ్యమంత్రి విజయన్ రానున్నారని తెలిపారు.రాబోయే కాలంలో కార్మికుల సమస్యలపై పోరాటాలు, ఆందోళనలు జరపటానికి ఈ మహాసభలో తగు నిర్ణయాలు తీసుకుంటారని తెలిపారు.

విరాళాలు సేకరణకు ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది అని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో నాయకులు బోడపట్ల సుదర్శన్, నర్రా రమేష్, నాగేశ్వరరావు నరేంద్ర, సుధాకర్, ch భద్రం, ఎండీ గౌస్, కె వెంకన్న, డి నాగరాజు, వీరబాబు, ప్రవీణ్, రామారావు మల్లికార్జున్ రెడ్డి, కుమారి, బీబీ తదితరులు పాల్గొన్నారు

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube