వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర మహాసభలు జయప్రదం కోరుతూ ఇంటా ఇంటా విరాళాలు సేకరణ...
TeluguStop.com
డిసెంబర్ నెలలో ఖమ్మం నగరంలో జరగబోయే వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర మహాసభలు జయప్రదం చేయాలని కోరుతూ ఖమ్మం టూ టౌన్ ఆధ్వర్యంలో మంగళవారం రేవతి సెంటర్ ఏరియాలో ఇల్లు ఇల్లు తిరిగి మాస్ ఫండ్ చేయడం జరిగింది.
ఈ సందర్భంగా నాయకులు కళ్యాణం వెంకటేశ్వరరావు, వై విక్రమ్ లు మాట్లాడుతూ వ్యవసాయ కార్మికుల సమస్యలపై నిరంతరం రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేసి వ్యవసాయ కార్మికుల పట్ల అండగా సంఘం నిలబడింది అని తెలిపారు.
డిసెంబర్ మొదటి వారంలో ఖమ్మం నగరంలో రాష్ట్ర మహాసభలు జరగబోతున్నాయని, ఈ మహాసభలకు ముఖ్య అతిథిగా కేరళ రాష్ట్ర ముఖ్యమంత్రి విజయన్ రానున్నారని తెలిపారు.
రాబోయే కాలంలో కార్మికుల సమస్యలపై పోరాటాలు, ఆందోళనలు జరపటానికి ఈ మహాసభలో తగు నిర్ణయాలు తీసుకుంటారని తెలిపారు.
విరాళాలు సేకరణకు ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది అని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో నాయకులు బోడపట్ల సుదర్శన్, నర్రా రమేష్, నాగేశ్వరరావు నరేంద్ర, సుధాకర్, Ch భద్రం, ఎండీ గౌస్, కె వెంకన్న, డి నాగరాజు, వీరబాబు, ప్రవీణ్, రామారావు మల్లికార్జున్ రెడ్డి, కుమారి, బీబీ తదితరులు పాల్గొన్నారు.
అల్లుఅర్జున్ పాటకు రోడ్డుపై బైకర్లు డ్యాన్స్.. వీడియో వైరల్