ప్రేమించిన వారు దక్కేందుకు ఆ స్వామి దర్శనానికి క్యూ కడుతున్న లవర్స్.. ఎక్కడ అంటే..?

శివాలయాల్లో శివుడు ఏ రూపంలో ఉంటాడో మనందరికీ తెలిసిందే… కానీ ఆ శివాలయంలో సతీసమేతంగా లింగ రూపంలో ఆ భవహరుడు భక్తులకు దర్శనం ఇస్తున్నాడు.ఏక్కడా లేని విధంగా ఆ శివాలయానికి ఓ ప్రత్యేకత ఉంది.

 Temple For Lovers Shakthivaneswara Temple Of Tamilnadu Details, Lovers,temple, V-TeluguStop.com

అందుకే ఆ గౌరీ శంకరులను దర్శించేందుకు ప్రేమికులు తెగ క్యూ కడుతున్నారు.

తమిళనాడు అంటనే శివాలయాల గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పని ఉండదు.

ఈ రాష్ట్రంలో సుమారుగా 1500 వరకు పేరున్న దేవాలయాలున్నాయి.అందులో ఎంతో ప్రసిద్ధి గాంచిన శక్తివనేశ్వర ఆలయం కూడా ఒకటి.

కుంభకోణంకు ఏడు కిలోమీటర్ల దూరంలో తిరుశక్తిమట్టం అనే గ్రామంలో ఈ ఆయలం ఉంది.

ఇక్కడ శివుడు పార్వతి కలిసి శివలింగకారంలో ఉంటారు.

దీంతో ఎక్కువ మంది భక్తులు ఆ స్వామిని దర్శించుకునేందుకు క్యూ కడుతున్నారు.ఈ అలయానికి మరో ప్రత్యేకత కూడా ఉంది.

ఎవరైనా ప్రేమికులు ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకుంటే వారితో పెళ్లి జరుగుతుందని నమ్మకం.దీంతో ఎక్కువగా ప్రేమికులు ఈ స్వామిని దర్శించుకునేందుకు భారులు తీరుతున్నట్లు అక్కడివారు చెబుతున్నారు.

భక్తితో ఆ స్వామిని ఆరాధిస్తే అనుకున్న కోరికలు తీరుతాయంటున్నారు.

Telugu Devotees, Latest, Lovers, Parvathi, Shivudu, Tamilnadu, Temple, Temple Lo

అయితే ఇక్క ఈ ఆలయం ఏర్పడడానికి ఓ కథ ప్రచారంలో ఉంది.పరమేశ్వరి ఒకనాడు ఆ ఈశ్వరుడిని చూసి ఆ శివుడే తన భర్తగా భావిస్తుంది.ప్రతి నిత్యం ఆ నీలకంఠున్నే స్మరిస్తూ… ఎలాగైనా ఆ గంగాధరుడిని పెళ్లి చేసుకోవాలని భావిస్తుంది.

దానికోసం ఘోరమైన తపస్సు చేస్తుంది.ఎంతకీ ఆ విశ్వేశ్వరుడు ప్రత్యక్షం కాకపోవడంతో పార్వతీదేవి ఏక కాలిపై కఠిన తపస్సు చేస్తుంది.

ఆ తపస్సుకు కూడా భవహరుడు ప్రసన్నుడు కాలేదు.దాంతో పార్వతీ దేవికి కోపం కట్టలు తెంచుకుని తపస్సును మరింత కఠినం చేస్తుంది.

Telugu Devotees, Latest, Lovers, Parvathi, Shivudu, Tamilnadu, Temple, Temple Lo

అంత ఘోర తప్పస్సును చూసిన ముక్కంటి.పరుగు పరుగున వచ్చి పార్వతి దేవి ముందు ప్రత్యక్షం అయ్యాడు.అయితే అగ్ని రూపంలో దర్శనమిచ్చిన ఢమరుకనాథుడిని చూసి బెనకకుండా ఆ అగ్నిరూపాన్నే పార్వతీ దేవి కౌగిలించుకుంటుంది.దానికి ఆనందపడిన శివుడు ఆమెను వివాహం చేసుకుంటాడు.ఈ విధంగా కఠిన తపస్సు చేసి శివుడిని పెళ్లి చేసుకుంటుంది.ఎక్కడయితే పార్వతీ దేవి శివున్ని కౌగిలించుకుంటుందో అక్కడే నిలిచి భక్తులకు కోంగుబంగారమై కోర్కెలు తీరుస్తూ శక్తివనేశ్వర ఆలయంగా వెలసింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube