ఉత్తరప్రదేశ్లో ఘోర ప్రమాదం జరిగింది.గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో గోడ కూలి తొమ్మిది మంది మృత్యువాత పడ్డారు.
ఈ ఘటన లక్నోలోని దిల్ కుషా ప్రాంతంలో చోటు చేసుకుంది.మృతుల్లో ముగ్గురు మహిళలు, ముగ్గురు చిన్నారులు ఉన్నట్లు తెలుస్తోంది.
సమాచారం అందుకున్న అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.
ఈ ఘటనపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.బాధిత కుటుంబానికి రూ.4 లక్షల పరిహారం ప్రకటించారు.అదేవిధంగా గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందేలా చూడాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.