యూపీలో ఘోర ప్రమాదం.. తొమ్మిది మంది మృతి

ఉత్తరప్రదేశ్‎లో ఘోర ప్రమాదం జరిగింది.గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో గోడ కూలి తొమ్మిది మంది మృత్యువాత పడ్డారు.

ఈ ఘటన లక్నోలోని దిల్ కుషా ప్రాంతంలో చోటు చేసుకుంది.మృతుల్లో ముగ్గురు మహిళలు, ముగ్గురు చిన్నారులు ఉన్నట్లు తెలుస్తోంది.

సమాచారం అందుకున్న అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.ఈ ఘటనపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

బాధిత కుటుంబానికి రూ.4 లక్షల పరిహారం ప్రకటించారు.

అదేవిధంగా గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందేలా చూడాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

ఫ్లైట్ ఆలస్యం అయిందని స్నాక్స్, వాటర్ ఉచితంగా ఇచ్చిన ఇండిగో..??