బిగ్ బాస్ సీజన్ 6 ఆదివారం ఎంతో ఘనంగా ప్రారంభమైంది.ఇక ఈ సీజన్లో ఏకంగా 21 మంది కంటెస్టెంట్లు ఎంట్రీ ఇచ్చారు.
అయితే ఇలా హౌస్ లోకి వెళ్ళిన కంటెస్టెంట్ లలో మొదటి రోజే పెద్ద ఎత్తున గొడవ పడినట్లు తెలుస్తోంది.ఇక ఈ కార్యక్రమంలోకి బిగ్ బాస్ రివ్యూ ఇస్తూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న గలాటా గీతూ ఎంతో సందడి చేస్తూ హౌస్ లోకి వెళ్లారు.
అయితే హౌస్ లోకి వెళ్లిన తరుణం నుంచి ఈమె గొంతు ఎక్కువగా వినపడుతుంది.చిత్తూరు స్లాంగ్ ఉపయోగిస్తూ తన మాట తీరుతో అందరిని ఆకట్టుకున్న గీతూ రాయల్ హౌస్ లోకి వెళ్లగానే గొడవ మొదలుపెట్టినట్టు తెలుస్తుంది.
ఈ క్రమంలోనే బాత్రూంలో ఎవరిదో జుట్టు మొత్తం రాలిపోయిందని ఇలా ఎవరి జుట్టు రాలిపోతే ఆ జుట్టు వాళ్లే తీయాలంటూ గట్టిగా అందరిపై చిందులు వేసింది.ఇక తనకు ఇలా బాత్రూంలో జుట్టు తీయడం ఏమాత్రం నచ్చదని ఒకవేళ బిగ్ బాస్ ఇదే టాస్క్ ఇచ్చిన తాను ఆ పని మాత్రం చేయనట్టు కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు.
ఇలా గీతూ రాయల్ ఈ విషయంపై పెద్ద ఎత్తున ఇతరులతో గొడవ పడుతూ రచ్చ చేశారు.
ఈ విధంగా ఈమె గొడవ పడటంతో బాలాదిత్య గీతూకి చిన్నపాటి క్లాస్ తీసుకున్నారని తెలుస్తుంది.నువ్వు చెప్పే విషయం కరెక్టే అయినా చెప్పే విధానం కరెక్ట్ కాదంటూ ఈయన గీతు రాయల్ కి ఎంతో అర్థమయ్యే విధంగా వివరించారు.ఇక ఈ గొడవ అనంతరం బిగ్ బాస్ హౌస్ లో ఉన్న సభ్యులను బిగ్ బాస్ మూడు విభాగాలుగా విభజించారు.
క్లాస్, మాస్, ట్రాష్ అనే మూడు విభాగాలుగా కంటెస్టెంట్లను విభజించి కంటెస్టెంట్ల మధ్య గొడవలకు ఆజ్యం పోసారని బిగ్ బాస్ తన గేమ్ మొదలుపెట్టారని తెలుస్తోంది.