హోరాహోరీ పోరు, భారీ అంచనాల మధ్య బ్రిటన్ కొత్త ప్రధాన మంత్రిగా లిజ్ ట్రస్ ఎన్నికైన సంగతి తెలిసిందు.దీంతో భారత సంతతికి చెందిన రిషి సునాక్‌కు ఓటమి తప్పలేదు.
సర్వేలన్నీ లిజ్ ట్రస్ వైపే మొగ్గు చూపినప్పటికీ.చివరి వరకు పోరాడాలని సునాక్ నిర్ణయించుకున్నారు.
కానీ ఫలితం మాత్రం నిరాశ కలిగించింది.అయితే లిజ్ ట్రస్ ఎన్నిక తర్వాత దేశ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.
దీనిలో భాగంగా యూకే హోంమంత్రి ప్రీతి పటేల్ షాకిచ్చారు.తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఆమె ప్రకటించారు.కొత్త ప్రధాని లిజ్ ట్రస్‌కు అభినందనలు తెలిపిన అనంతరం.తన స్థానంలో దేశ కొత్త హోంమంత్రిగా మరొకరు వస్తారని ప్రీతి తెలిపారు.
అలాగే ప్రధాని లిజ్ ట్రస్‌కు తన పూర్తి సహకారం వుంటుందని ఆమె స్పష్టం చేశారు.బోరిస్ జాన్సన్ నేతృత్వంలో దేశానికి హోంమంత్రిగా సేవలు అందించడం తనకు దక్కిన గౌరవంగా పేర్కొన్నారు.
ఈ మేరకు ఆయనకు ప్రీతి పటేల్ లేఖ రాశారు.దీనితో పాటు తాను హోంమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఎదుర్కొన్న పరిస్ధితులను, తీసుకున్న నిర్ణయాలను, సంస్కరణలను ఆమె లేఖలో పేర్కొన్నారు.
ఇదీ ప్రీతి పటేల్ ప్రస్థానం :గుజరాతీ ఉగాండా సంతతికి చెందిన ప్రీతి పటేల్.2019 జూలై నుంచి హోం కార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తున్నారు.థెరెసా మే ప్రభుత్వంలోనూ మంత్రిగా పనిచేసిన అనుభవం ప్రీతికి ఉంది.అయితే రెండేళ్ల క్రితం ఓ వివాదం కారణంగా ఆమె రాజీనామా చేయాల్సి వచ్చింది.అప్పుడు అంతర్జాతీయ అభివృద్ధి మంత్రిగా అభివృద్ధి చెందుతున్న దేశాలకు బ్రిటన్ అందించే ఆర్థిక సహకారానికి సంబంధించిన వ్యవహారాలను ఆమె పర్యవేక్షించేవారు.
లండన్‌లోనే జన్మించిన ప్రీతి .తల్లిదండ్రుల స్వస్థలం గుజరాత్.వారు మొదట ఉగాండాలో నివసించేవారు.
అయితే, ఉగాండాలో అప్పుడున్న పాలకుడు దక్షిణాసియాకు చెందినవారిపై దేశ బహష్కరణ విధించారు.దీంతో ప్రీతి తల్లిదండ్రులు బ్రిటన్‌కు వలసవచ్చారు.వైట్‌ఫోర్డ్ గ్రామర్ స్కూల్, వెస్ట్‌ఫీల్డ్ టెక్ కాలేజ్, కీల్ వర్సిటీ, ఎసెక్స్ విశ్వవిద్యాలయాల్లో ప్రీతి చదువుకున్నారు.20 ఏళ్లు కూడా నిండకముందే ప్రీతి కన్జర్వేటివ్ పార్టీలో చేరారు.కన్జర్వేటివ్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఉద్యోగినిగా సేవలందించారు.1995 నుంచి 1997 వరకూ జేమ్స్ గోల్డ్‌స్మిత్ నేతృత్వంలోని రెఫరెండమ్ పార్టీకి ప్రతినిధిగా ఉన్నారు.ఆ పార్టీ యురోపియన్ యూనియన్ను వ్యతిరేకించింది.డేవిడ్ కేమరూన్ హయాంలో ఏడాదిపాటు ట్రెజరీ శాఖలో సహాయమంత్రిగా, మరో ఏడాది ఉద్యోగకల్పన శాఖలో మంత్రిగా ఆమె పనిచేశారు
.