టాలీవుడ్ చిత్ర నిర్మాణాలకు కొత్త మార్గదర్శకాలు విడుదల అయ్యాయి.ఆగస్ట్ 25 నుంచి చిత్రీకరణలు మొదలైన సంగతి తెలిసిందే.
అదేవిధంగా సెప్టెంబర్ 1 నుంచి పూర్తి స్థాయిలో షూటింగులకు ప్రొడ్యూసర్స్ గిల్డ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.సినీ సందడి మళ్లీ మొదలైన నేపథ్యంలో చిత్ర నిర్మాణాలకు సంబంధించి మార్గ దర్శకాలు విడుదల చేసింది.
అయితే ఈ మార్గదర్శకాలు సెప్టెంబర్ 10 వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయని తెలిపింది.
ప్రతి అగ్రిమెంట్ లోనూ పారితోషికం వివరాలు కచ్చితంగా ఉండాలి.
ఆ వివరాలను చాంబర్ నిర్ధారించాల్సి ఉంటుంది.ఆర్టిస్టులకు, టెక్నీషియన్లకు రోజువారీ చెల్లింపులు ఉండవు.
అదేవిధంగా ఓ సినిమా టైటిల్స్ లో, థియేట్రికల్ రిలీజ్ ప్రచారంలో ఓటీటీ, శాటిలైట్ భాగస్వాముల పేర్లు ఉండవని తెలిపింది.ఒక సినిమా విడుదలైన 8 వారాల తర్వాతే ఓటీటీకి ఇవ్వాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.