జాతీయ రైతు సంఘాల నేతలతో సీఎం కేసీఆర్ రెండో రోజు నిర్వహించిన సమావేశం ముగిసింది.ఈ సందర్భంగా రైతు సంఘం నేతలను ఆయన సత్కరించారు.
రైతు నేతలు సైతం రాజకీయాల్లో భాగస్వాములు కావాలన్నారు.అదేవిధంగా దేశ రైతాంగ సమస్యల పరిష్కరానికి పాటు పడాలని పేర్కొన్నారు.
దేశానికి అన్నం పెట్టే రైతులు చట్ట సభల్లోకి ఎందుకు వెళ్లకూడదని ఆయన ప్రశ్నించారు.ప్రజాస్వామిక పార్లమెంటరీ పంథా ద్వారానే సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని వ్యాఖ్యనించారు.
తెలంగాణ వ్యతిరేకులతో జై తెలంగాణ నినాదం పలికించినట్లే.రైతు వ్యతిరేకులతో జై కిసాన్ నినాదం పలికించాలని పిలుపునిచ్చారు.