మునుగోడు' అభ్యర్థులను ఎంపిక చేసేది ఆ సర్వేలే?

ఇప్పుడు తెలంగాణ రాజకీయం మొత్తం ‘మునుగోడు’ చుట్టూనే తిరుగుతోంది.ప్రధాని పార్టీలన్నీ ఇక్కడ ఎన్నికల ప్రచారాన్ని మొదలుపెట్టేశాయి.

 These Surveys Can Decide The Party Candidates In Munugode By Polls Details, Munu-TeluguStop.com

ఉప ఎన్నికల నోటిఫికేషన్ ఇంకా వెలువలేకపోయినా, అప్పుడే ఎన్నికలు వచ్చినంత స్థాయిలో హడావుడి చేస్తూ, ప్రజలలో బలం పెంచుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి.మునుగోడు నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా 2018 లో గెలిచిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీకి, పదవికి రాజీనామా చేసి బిజెపిలో చేరిపోయారు.

దీంతో ఇక్కడ  ఉప ఎన్నికలు అనివార్యంగా మారింది.స్పీకర్ కూడా రాజగోపాల్ రెడ్డి రాజీనామాను ఆమోదించడంతో త్వరలోనే ఇక్కడ ఉప ఎన్నికలు రాబోతున్నాయి.

ఇక బిజెపి నుంచి రాజగోపాల్ రెడ్డి పోటీ చేస్తుండగా,  కాంగ్రెస్, టిఆర్ఎస్ లు ఇంకా అభ్యర్థులను ఎంపిక చేసే పనిలోనే నిమగ్నమయ్యాయి.
  మునుగోడులో తనకు గట్టి పట్టు ఉందని, తానే గెలుస్తానని రాజగోపాల్ రెడ్డి నమ్మకంగా చెబుతుండగా, ఇది కాంగ్రెస్ సిట్టింగ్ స్థానమని,  దీనిని గెలుచుకుని రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో తమ సత్తా చాటుతామని కాంగ్రెస్ ప్రకటనలు చేస్తుంది.

ఇక అధికార పార్టీ టిఆర్ఎస్ ఈ రెండు పార్టీల కంటే బలమైన అభ్యర్థిని రంగంలోకి దించి గెలవాలని ప్రయత్నాలు చేస్తూ,  ఈ నియోజకవర్గంలో కనివిని ఎరగని రీతిలో అభివృద్ధికి శ్రీకారం చుట్టింది.ఇప్పటికే ఈ నియోజకవర్గంలో ప్రధానంగా ఉన్న అన్ని సమస్యలను పరిష్కరిస్తూ,  టిఆర్ఎస్ వైపు ప్రజలు చూపు ఉండేలా చేసుకుంటోంది.

ఈ ఉప ఎన్నికల్లో ఏ పార్టీ గెలిస్తే ఆ పార్టీ వైపు జనాలు మొగ్గు చూపే అవకాశం ఉండడం,

Telugu Aicc, Congress, Komatirajagopal, Munugode, Munugodu, Revanth Reddy, Telan

  అధికారంలోకి వచ్చేందుకు ఛాన్స్ ఏర్పడడం వంటి విషయాలను సీరియస్ గా తీసుకొని అన్ని పార్టీలు అభ్యర్థుల ఎంపికపైనే ప్రధానంగా ఫోకస్ చేశాయి.కాంగ్రెస్ నుంచి నలుగురు అభ్యర్థులు ఇక్కడి నుంచి పోటీ చేసేందుకు గట్టిగా పోటీ పడుతుండగా,  అందులో పాల్వాయి స్రవంతి పేరు ఎక్కువగా వినిపిస్తోంది.అయితే ఇప్పటికే ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు సిద్ధమైన అభ్యర్థులను కాంగ్రెస్ వ్యూహకర్త సునీల్ కానుగోలు ఇంటర్వ్యూ కూడా నిర్వహించారు.దీనికి తోడు నియోజకవర్గంలో అంతర్గతంగా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏ విధంగా ఉంది ? ఎవరిని అభ్యర్థిగా నిలబెడితే తప్పకుండా గెలుస్తారు వంటి ఎన్నో అంశాలపై సర్వేలు నిర్వహిస్తున్నారు.
 

Telugu Aicc, Congress, Komatirajagopal, Munugode, Munugodu, Revanth Reddy, Telan

ఇక టిఆర్ఎస్ సైతం ఇదేవిధంగా సర్వేలకు దిగింది.పార్టీ తరఫున ఎవరిని పోటీకి దింపితే బాగుంటుందనే విషయంపై అంతర్గతంగా సర్వేను చేస్తున్నారు.ఇక ఈ స్థానంపై టిఆర్ఎస్ నుంచి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారు.2014 ఎన్నికల్లో ఈయన గెలిచినా, 2018 ఎన్నికల్లో ఓటమి చెందారు.అయితే కాంగ్రెస్ కనుక బీసీ అభ్యర్థిని పోటీకి దింపితే , తాము కూడా అదే సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థిని పోటీకి దించాలని టిఆర్ఎస్ ప్లాన్ చేసుకుంటోంది.కాకపోతే సర్వే నివేదికల ఆధారంగానే అభ్యర్థులను ఎంపిక చేయాలని , అభ్యర్థి ఎవరు అయితే గెలుపు అవకాశాలు ఉంటాయో వారికి టిక్కెట్ ఇవ్వాలనే వ్యూహంతో కాంగ్రెస్,  టిఆర్ఎస్ లో ఉన్నాయి .మొత్తంగా మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నికలలో పార్టీ అభ్యర్థులు ఎవరనేది నిర్ణయించేది ఈ సర్వేలే అనే విషయం స్పష్టం అవుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube