వేలం పాటలో అప్పుడప్పుడు అద్భుతాలు జరుగుతూ ఉంటాయి.అవేనండి.
కొందరు కేటుగాళ్లు అమాయక జనాలను బురిడీ కొట్టిస్తుంటారు.ఓ ఫ్యామిలీ స్థానికంగా జరుగుతున్న వేలం పాటకు వెళ్లింది.
అందులో ఆ కుటుంబం కొన్ని సూట్‌కేసులు అతి తక్కువ ధరకు గెలుచుకున్నారు.దాంతో వారు ఎగిరి గంతేశారు.
అయితే వారి సంతోషం ఎంతసేపో నిలవలేదు.ఇంటికి వెళ్ళాక అవి ఓపెన్ చేసి చూడగా ఆ ఫ్యామిలీ ఒక్కసారిగా ఉలిక్కిపడింది.
విషయంలోకి వెళితే… న్యూజిలాండ్‌లోని సౌత్ ఆక్లాండ్‌కు చెందిన ఓ కుటుంబం స్థానికంగా జరిగిన స్టోరేజ్ యూనిట్ ఆక్షన్‌లో 5 సూట్‌కేసులను గెలుచుకుంది.
అయితే వేలం పాట జరుగుతున్నప్పుడు.
ఆ సూట్‌కేసులు ఓపెన్ చేయకూడదన్న నిబంధన వలన సదరు ఫ్యామిలీ ఇంటికెళ్లి వాటిని ఓపెన్ చేసింది.ఇక అంతే! అందులో కనిపించిన వాటిని చూసి ఒక్కసారిగా అందరూ భయబ్రాంతులకు గురయ్యారు.
ఆ సూట్‌కేసుల్లో మానవ అవశేషాలను గుర్తించిన ఫ్యామిలీ.వెంటనే పోలీసులకు సమాచారాన్ని అందించారు.
దాంతో సూట్‌కేసుల్లో లభ్యమైన మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.అనంతరం పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
ఇకపోతే ఈ హత్యలతో ఆ ఫ్యామిలీకి ఎలాంటి సంబంధం లేదని పోలీసులు నిర్ధారణకు వచ్చారు.దీనిపై సరియైన దర్యాప్తు చేసి నిందితుల్ని అతి త్వరలో ఛేదిస్తామని పోలీసులు స్పష్టం చేశారు.అసలు ఆ మృతదేహాలు ఎవరివి.? అవి సూట్‌కేసుల్లోకి ఎలా వచ్చాయి.? అనే విషయాలు పోస్టుమార్టం రిపోర్టులు వచ్చిన అనంతరం తెలిసే అవకాశం ఉందని.అప్పుడే ఇన్వెస్టిగేషన్లో ముందుకు వెళ్ళగలమని పోలీసులు చెప్పారు.