రవితేజ మూవీ రెండు రోజుల కలెక్షన్లు అన్ని కోట్లా.. డబుల్ డిజాస్టర్ అంటూ?

ఈ మధ్య కాలంలో ప్రేక్షకుల అభిరుచి మారడంతో హిట్ టాక్ వచ్చిన సినిమాలు మినహా సాధారణ సినిమాలను ప్రేక్షకులు పట్టించుకోవడం లేదు.రవితేజ నటించిన రామారావు ఆన్ డ్యూటీ సినిమాకు మార్నింగ్ షో నుంచి నెగిటివ్ టాక్ స్ప్రెడ్ అయిన సంగతి తెలిసిందే.

 Raviteja Movie Two Days Collections Details Here Goes Viral , Rama Rao On Duty,-TeluguStop.com

రవితేజ కెరీర్ లో ఏ సినిమాకు రాని స్థాయిలో ఈ సినిమాకు దారుణంగా కలెక్షన్లు వస్తున్నాయి.ఈరోజు కూడా ఈ సినిమాకు బుకింగ్స్ ఆశించిన స్థాయిలో లేవు.

రామారావు ఆన్ డ్యూటీ థియేటర్లలో 20 శాతం ఆక్యుపెన్సీ కూడా కనిపించకపోవడంతో ఈ సినిమా హక్కులను కొనుగోలు చేసిన బయ్యర్లకు భారీ మొత్తంలో నష్టాలు రావడం ఖాయమని తేలిపోయింది.నైజాంలో ఈ సినిమా కోటీ 3 లక్షల రూపాయలు సాధించగా సీడెడ్ లో 59 లక్షల రూపాయల కలెక్షన్లను సాధించింది.

ఉత్తరాంధ్రలో ఈ సినిమా ఏకంగా 50 లక్షల రూపాయల కలెక్షన్లు సాధించడం గమనార్హం.

ఉత్తరాంధ్రలో ఈ సినిమా 50 లక్షల రూపాయల కలెక్షన్లను సొంతం చేసుకోగా గోదావరి జిల్లాలలో 51 లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి.

ఇతర ఏరియాలలో ఈ సినిమాకు ఏకంగా 62 లక్షల రూపాయల కలెక్షన్లు రావడం గమనార్హం.రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా ఏకంగా 3 కోట్ల 28 లక్షల రూపాయల షేర్ కలెక్షన్లను సొంతం చేసుకుంది.

ఓవర్సీస్ లో ఈ సినిమా కలెక్షన్లు 40 లక్షల రూపాయలు కాగా ఇతర ప్రాంతాలలో 28 లక్షల రూపాయలుగా ఉన్నాయి.

Telugu Rama Rao Duty, Raviteja, Days, Uttarandhra-Movie

ప్రపంచవ్యాప్తంగా 2 రోజుల్లో ఈ సినిమా 3.96 కోట్ల రూపాయల కలెక్షన్లను సాధించింది.15 కోట్ల రూపాయలకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈ సినిమా ఇంత తక్కువ స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకోవడం గురించి తెలిసి నెటిజన్లు సైతం ఆశ్చర్యపోతున్నారు.రవితేజ భవిష్యత్తు సినిమాలపై ఈ సినిమా ఎఫెక్ట్ పడే ఛాన్స్ అయితే ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube