Corn Flour : మొక్కజొన్న ఆరోగ్యానికే కాదు అందాన్ని కూడా పెంచుతుంది.. ఇలా వాడారంటే మీ స్కిన్ వైట్ అవ్వాల్సిందే!

పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఎంతో ఇష్టంగా తినే ఆహారాల్లో మొక్కజొన్న ఒకటి.మొక్కజొన్నలు( Corn ) తినడానికి చాలా రుచికరంగా ఉంటాయి.

 Best Way To Use Corn Flour For Skin Whitening-TeluguStop.com

పైగా అనేక రకాల విటమిన్స్, మినరల్స్, ఫైబర్ తో సహా బోలెడు పోషకాలను కలిగి ఉంటాయి.అందువల్ల ఆరోగ్యపరంగా మొక్కజొన్నలు ఎంతో మేలు చేస్తాయి.

అయితే ఆరోగ్యానికే కాదు అందాన్ని పెంచడానికి కూడా మొక్కజొన్న సహాయపడుతుంది.ముఖ్యంగా మొక్కజొన్న పిండిని ఇప్పుడు చెప్పబోయే విధంగా వాడారంటే మీ స్కిన్ సూపర్ వైట్ గా మరియు బ్రైట్ గా మెరిసిపోతుంది.

అదే సమయంలో మరిన్ని స్కిన్ కేర్ బెనిఫిట్స్ ను మీరు పొందవచ్చు.

Telugu Tips, Corn Face Pack, Face Pack, Skin, Latest, Skin Care, Skin Care Tips-

మొక్కజొన్న పిండి( Corn flour ) మనకు కార్న్ ఫ్లోర్ గా ఎప్పుడూ అందుబాటులోనే ఉంటుంది.ఈ కార్న్ ఫ్లోర్ లో ఎన్నో బ్యూటీ బెనిఫిట్స్ దాగి ఉన్నాయి.కార్న్ ఫ్లోర్ ను చర్మానికి ఎలా ఉపయోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం.

ముందుగా ఒక అవకాడో ని తీసుకొని సగానికి కట్ చేసి గిన్నె తొలగించి పల్ప్ ను సపరేట్ చేసుకోవాలి.ఈ అవకాడో పల్ప్ ను మిక్సీ జార్ లో వేసుకోవాలి.

అలాగే రెండు టేబుల్ స్పూన్లు మొక్కజొన్న పిండి, వన్ టేబుల్ స్పూన్ తేనె, చిటికెడు పసుపు మరియు నాలుగు టేబుల్ స్పూన్లు కాచి చల్లార్చిన పాలు మరియు నాలుగు టేబుల్ స్పూన్లు రోజ్‌ వాటర్( Rose water ) వేసుకుని స్మూత్ గా గ్రైండ్ చేసుకోవాలి.

Telugu Tips, Corn Face Pack, Face Pack, Skin, Latest, Skin Care, Skin Care Tips-

ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని ముఖానికి మెడకు అప్లై చేసుకుని ఇరవై నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.ఆపై చర్మాన్ని శుభ్రంగా వాటర్ తో క్లీన్ చేసుకోవాలి.వారానికి కేవలం రెండుసార్లు ఈ ఫేస్ ప్యాక్ ను వేసుకోవ‌డం వల్ల అదిరిపోయే లాభాలు మీ సొంతం అవుతాయి.

ముఖ్యంగా ఈ ప్యాక్ వల్ల చర్మంపై పేరుకుపోయిన డెడ్ స్కిన్ సెల్స్‌ తొలగిపోతాయి.అలాగే డస్ట్ మొత్తం క్లీన్ అవుతుంది. స్కిన్ టోన్ మెల్లమెల్లగా ఇంప్రూవ్‌ అవుతుంది.చర్మం కాంతివంతంగా మెరుస్తుంది.

అలాగే ఓపెన్ పోర్స్ క్లోజ్ అవుతాయి.అంతే కాదు ఈ ప్యాక్ ను వేసుకోవడం వల్ల స్కిన్ తేమగా ఉంటుంది.

స్మూత్ గా మారుతుంది.బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ సైతం తొలగిపోతాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube