తెలంగాణ రాష్ట్రంలో గత బీఆర్ఎస్( BRS ) ప్రభుత్వం చేసిన అక్రమాలను కాంగ్రెస్ పార్టీ ( Congress party )ఒక్కోటిగా బయటపెడుతోంది.కాలేశ్వరం ప్రాజెక్టు, ధరణి వంటి వాటిలో అక్రమాలు జరిగినట్లు ఇప్పటికే కాంగ్రెస్ తీవ్ర ఆరోపణలు చేసింది.
కేసీఆర్ పాలనలో జరిగిన అక్రమాలకు అంతేలేదు అనే విధంగా కాంగ్రెస్ నాయకులు ఆరోపణలు చేస్తున్నారు.అయితే కాంగ్రెస్ ప్రభుత్వం రెండు, మూడేళ్ల తర్వాత కుప్పకూలితే, మళ్ళీ కేసీఆర్( kcr ) వస్తే ఈ అక్రమాలను ఆపే వాడే ఉండడని కొంతమంది భయం వ్యక్తం చేస్తున్నారు.
ఏ రంగాన్ని ప్రస్తుత ప్రతిపక్ష పార్టీ నాయకులు వదల్లేదని, అన్నిటిలో అక్రమాలు, అరాచకాలకు పాల్పడ్డారని సీఎం రేవంత్ రెడ్డి ( CM Revanth Reddy ) ఆరోపిస్తున్నారు.
మిషన్ భగీరథ ప్రాజెక్టులో ( Mission Bhagiratha project )కూడా అక్రమాలు జరిగాయని, మెటీరియల్స్ కొనుగోలు చేయకుండానే ఫేక్ బిల్స్ పెట్టి డబ్బులు కాజేశారని తాజాగా కాంగ్రెస్ ఆరోపణలు చేసింది.
ఇంట్రా విలేజ్ వర్క్స్ లోనూ మోసాలు జరిగాయని అంటున్నారు.దీనిపై ఇన్వెస్టిగేషన్ చేయాలని విజిలెన్స్ ను రేవంత్ రెడ్డి సర్కార్ ఆదేశించినట్లు వార్తాపత్రికల్లో అనేక కథనాలు వచ్చాయి.
అయితే మిషన్ భగీరథ ప్రాజెక్టులో జరిగిన అక్రమాల్లో మాజీ సీఎంఓ సెక్రటరీ, ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ ( Smita Sabharwal )పాత్ర ఉందా లేదా అనే కోణంలోనూ విజిలెన్స్ విచారణ చేయాలని ప్రభుత్వం ఆదేశించిందట.ఎందుకంటే ఆమె మిషన్ భగీరథ ప్రాజెక్టును స్వయంగా పర్యవేక్షించారు.
ఈ పథకంలోని పనులన్నీ ఆమెకు తెలిసే జరిగాయి.ఇందులోని మైనస్‌లు, ప్లస్‌లు అక్రమాలు వంటి వాటన్నిటి గురించి ఆమెకు తెలిసే ఉంటుందని రేవంత్ రెడ్డి ప్రభుత్వం భావించి, ఆమెను లోతుగా విచారించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.
నిజానికి స్మిత సబర్వాల్ తెలంగాణ( Telangana ) ప్రజల కోసం ఎన్నో సేవలందించారు.తెలంగాణ సమాజం కూడా ఆమెను తెలుగు బిడ్డగా అభిమానించింది.ఔట్‌లుక్ ఆమె గురించి ఒక సెక్సీస్ట్ కార్టూన్ ప్రచురిస్తే ఆ సమయంలోనూ తెలంగాణ సమాజం ఆమెకు మద్దతుగా నిలిచింది.న్యాయ పోరాటానికి తెలంగాణ ప్రభుత్వం సొంత నిధులను వాడుకోవడానికి అనుమతించింది.
అంతలా తెలంగాణ సమాజం అభిమానించిన ఆమెను ఇప్పుడు నేరస్తురాలిగా విచారించడం అన్యాయమని కొందరు ఫైర్ అవుతున్నారు.
ప్రభుత్వం డబ్బుల కోసం అక్రమాలకు పాల్పడితే ఆమె చేసేదేముంది అని మరికొందరు ప్రశ్నిస్తున్నారు.ఒకవేళ ఆమె ద్వారా గత పాలనలో జరిగిన అక్రమాలు బయటపడితే అది ఒకందుకు మంచిదేగా? విచారణ చేయడంలో తప్పులేదు అని మరికొందరు అంటున్నారు.ఇది ఏమైనా ఆమెను విచారించాలని వస్తున్న వార్తలు ఇప్పుడు సంచలనంగా మారింది.
ఇకపోతే 30 వేల కోట్లతో భగీరథ ప్రాజెక్టు చేపట్టినట్లు కేసీఆర్ ప్రభుత్వం చెప్పుకుంది.ఈ పథకం మంచిదే, ప్రజలకు చాలా ప్రయోజనాలను చేకూర్చింది.
అయితే ఈ పథకంలోనూ పాత సామాగ్రిని కొత్త సామాగ్రిగా చూపించి ఎక్కువ డబ్బులు కాజేశారనేది కేసీఆర్ పాలనపై ఎప్పటినుంచో వినిపిస్తున్న ప్రధాన ఆరోపణ.