టాలీవుడ్ నంబర్ వన్ హీరో ఎవరనే ప్రశ్నకు ప్రేక్షకుల్లో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి.దాదాపుగా అందరు హీరోలకు సమాన స్థాయిలో అభిమానులు ఉన్నారు.
హిట్ ఫ్లాపుల విషయంలో కూడా దాదాపుగా అందరు హీరోలు సమాన స్థాయిలో ఉన్నారు.ఆర్మాక్స్ మీడియా జూన్ నెల సర్వే ఫలితాలను తాజాగా వెల్లడించగా ప్రభాస్ ఈ జాబితాలో తొలి స్థానాన్ని సంపాదించుకోవడం గమనార్హం.
ప్రభాస్ గత సినిమాలు సాహో, రాధేశ్యామ్ బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు.
ఈ సినిమాల ఫలితాలు అభిమానులను సైతం నిరాశకు గురి చేశాయి.
అయితే సినిమాల ఫలితాలతో సంబంధం లేకుండా ప్రభాస్ తొలి స్థానాన్ని సంపాదించుకోవడం ఆయనకు ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్ కు నిదర్శనమని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.ప్రభాస్ తర్వాత ఆ జాబితాలో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ నిలిచారు.
ఆర్ఆర్ఆర్ సక్సెస్ తో సంతోషంలో ఉన్న తారక్ కు ఈ జాబితాలో రెండో స్థానంలో నిలవడం మరింత సంతోషాన్ని కలిగిస్తుందని చెప్పవచ్చు.
స్టార్ హీరో అల్లు అర్జున్ ఈ జాబితాలో మూడో స్థానంలో ఉన్నారు.
మహేష్ బాబు ఈ జాబితాలో నాలుగో స్థానంలో ఉండగా రామ్ చరణ్ ఐదో స్థానంలో ఉన్నారు.పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ జాబితాలో ఆరో స్థానంలో నిలవడం గమనార్హం.అంటే సుందరానికి సినిమాతో యావరేజ్ రిజల్ట్ ను సొంతం చేసుకున్న నాని ఈ జాబితాలో ఏడో స్థానంలో నిలిచారు.
మెగాస్టార్ చిరంజీవి ఈ జాబితాలో ఎనిమిదో స్థానంలో నిలవడం గమనార్హం.విజయ్ దేవరకొండ ఈ జాబితాలో తొమ్మిదో స్థానంలో నిలవగా రవితేజ ఈ జాబితాలో పదో స్థానంలో నిలిచారు.ప్రతి నెలా హీరోల స్థానాలలో మార్పులు వస్తుండటం గమనార్హం.
పలువురు నెటిజన్లు ఈ సర్వే ఫలితాలను మెచ్చుకుంటుంటే మరి కొందరు నెటిజన్లు మాత్రం ఈ సర్వే ఫలితాలు తప్పు అని అభిప్రాయం వ్యక్తం చేయడం గమనార్హం.