అన్న ఇచ్చిన ధైర్యంతో టక్కున ఏడుపు ఆపేసిన తమ్ముడు.. వీడియో వైరల్

చిన్న పిల్లల హావభావాలు, వారి ప్రవర్తన ఒక్కోసారి చూడముచ్చటగా ఉంటుంటాయి.ముఖ్యంగా తల్లిదండ్రులకు వారు విసుగు రప్పించినా, వారి అల్లరిని ఎంజాయ్ చేస్తుంటారు.

 The Younger Brother Stopped Crying Because Of The Courage Given By His Brother-TeluguStop.com

ఎన్నో మధుర స్మృతులను అలా పెనవేసుకుంటుంటారు.ముఖ్యంగా చిన్న పిల్లలను ఎక్కడికైనా విహార యాత్రకు తీసుకెళ్లాలని భావిస్తుంటారు.

అలాంటి సందర్భాల్లో ఒక్కో సారి వారి అల్లరి శృతి మించుతుంటుంది.అది కావాలి, ఇది కావాలి అని గోల పెడుతుంటారు.

తీరా కొనిచ్చాక వేరేది కావాలంటారు.ఏదైనా ఎగ్జబిషన్‌కు తీసుకెళ్తే కనిపించిన ప్రతిదీ ఎక్కాలని గోల చేస్తారు.

తీరా ఎక్కిన తర్వాత గగ్గోలు పెడుతుంటారు.ఇదే కోవలో ఓ బొమ్మ కారు ఎక్కిన బాలుడు గుక్క పెట్టి ఏడ్చాడు.

అయితే అదే వయసు ఉన్న అతడి అన్న కూడా ఎక్కాక టక్కున ఏడుపు ఆపేశాడు.దీనికి సంబంధించిన ఆసక్తికర విషయాలిలా ఉన్నాయి.

పదేళ్లలోపు పిల్లలను ఎక్కడికైనా విహార యాత్రకు తీసుకెళ్లినప్పుడు బ్యాటరీ కార్లు వంటివి ఎక్కాలని చాలా మంది తహతహలాడుతుంటారు.అయితే వాటిని ఎక్కాక కొందరు భయపడుతుంటారు.తాజాగా ఇంటర్‌నెట్‌లో వైరల్ అవుతున్న వీడియోలో ఓ బాలుడు బాగా ఏడ్చాడు.అదే వయసు ఉన్న అతడి అన్న కాసేపటికి ఆ బొమ్మ కారు ఎక్కాడు.

దీంతో అన్న వచ్చాడనే ధైర్యంతో ఆ బాలుడు వెంటనే ఏడుపు ఆపేశాడు.వారి ఎక్స్‌ప్రెషన్స్ చాలా బాగున్నాయని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.

ముఖ్యంగా అన్నదమ్ముల బంధం గురించి పలువురు ప్రస్తావిస్తున్నారు.అన్న పక్కనున్నాడనే ధైర్యం ఆ బాలుడికి ఏడుపును దూరం చేసిందని, భయం పోగొట్టిందని పలువురు గుర్తు చేస్తున్నారు.

అన్నాదమ్ముుల అనుబంధం వెలకట్టలేదని, అది ఆ బాలుడి విషయంలో చూడొచ్చని పలువురు కామెంట్లు పెడుతున్నారు.గత నెల 17న ఈ వీడియోను ద మాంటే ష్యామిలీ సూనేతో పోస్ట్ చేశారు.ఇప్పటికే ఆ వీడియోకు 13 వేల లైకులు, 2.5 లక్షల వ్యూస్ దక్కాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube