'శ్రీ'కారం అనగా ఏమిటి ?

“శ్రీ” లక్ష్మీ ప్రదమైనది, మంగళ కరమైనది, అలాగే మోక్ష దాయకమైనది.శ్రీ కారమున శవర్ణ, రేఫ, ఈ కారములు చేరి, శ్రీ అయినది.

 What Is The Meaning Of Srikaram , Devotional ,  Importance Of Sri ,  Sri Meaning-TeluguStop.com

శవర్ణ ఈ కారములకు లక్ష్మీ దేవి అధి దేవత.రేఫమునకు అగ్నిగ దేవుడు దేవత.‘శ్రియమిచ్చేద్దు తాశనాత్ అనుపురాణ వచనానుసారంగా ‘అగ్ని’యూ లక్ష్మీ ప్రదుడే, శుభకరుడే.ఇలా శ్రీ లో గల మూడు వర్ణములకు శుభ దేవతలే కారకులు అయ్యారు.‘శ’ వర్ణమునకు గ్రహం గురుడు.‘రేఫ’ ‘ఈ’ కారములకు గ్రహాలు ‘గురుడు’ ‘శుక్రుడు’ గురు, శుక్ర గ్రహములు రెండూ శుభకరులే కావున ‘శ్రీ’ శుభాన్ని సూచిస్తుంది.శుభాన్ని కోరుతుంది.నిఘంటువులో ‘కమలా శ్రీర్హరిప్రియా’ అని ఉంది.లక్ష్మీ నామములలో ‘శ్రీ’ ఒకటి అని తెలుస్తోంది.కావున శుభ వాచకమైనది.

ఇన్ని విధాలుగా శ్రీ సర్వ శ్రేష్ట వాచకం అయింది.ప్రతి శుభకార్యానికి, శ్రీ కారము తలమానికంగా వెలుగొందుతుంది.శ్రీ శుభ సూచికయే కాదు, గౌరవ ప్రదమైనది కూడా.ఏ మతంలో అయినా, ఏ ప్రాంతంలో అయినా, ఏ భాషలో అయినా శ్రీ అను పదం గౌరవ సూచకంగా, శుభ సూచకంగా వాడుతుంటారు.

దీనిని బట్టి శ్రీ కారమునకు ఎంతటి ఉన్నతమైన స్థాన మున్నదో అర్థం అవుతుంది.అందుకే పెద్దలను పిలిచేటప్పుడు శ్రీ అనే పదాన్ని వారి పేరు ముందు చేర్చి పిలుస్తుంటాం.

దీనికి అర్థం వారిని మనం చాలా గౌరవిస్తున్నట్లు.కొందరు ముందు రెండు, మూడు శ్రీలను కూడా చేరుస్తుంటారు.

ఇందుకు కారణం… వారికి మరింత ఎక్కువ గౌరవం ఇస్తున్నట్లు.పేరుకు ముందు ఎన్ని శ్రీలు ఎక్కువ పెడితే అంత గౌరవం ఇస్తున్నట్లు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube