మెగాస్టార్ చిరంజీవి కె.ఎస్ రవీంద్ర డైరక్షన్ లో వస్తున్న వాళ్తేర్ వీరయ్య సినిమా రిలీజ్ డేట్ లాక్ చేశారు.
మెగా మాస్ మూవీగా మెగాస్టార్ చిరంజీవి 154వ సినిమా రాబోతుంది.వెంకీ మామ తర్వాత కె.ఎస్ రవీంద్ర చేస్తున్న ఈ మూవీపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.వాళ్తేర్ వీరయ్య తప్పకుండా మెగా ఫ్యాన్స్ అందరిని ఖుషి అయ్యేలా చేస్తారని చెబుతున్నారు చిత్రయూనిట్.
సినిమాలో మెగా ఫ్యాన్స్ కోరుకునే అన్ని అంశాలు ఉన్నాయని అంటున్నారు.
ప్రస్తుతం చిరంజీవి లూసిఫర్ రీమేక్ గా గాడ్ ఫాదర్ సినిమా చేస్తున్నాడు.
దీనితో పాటుగా వేదాళం రీమేక్ గా భోళా శంకర్ సినిమా కూడా లైన్ లో ఉంది.ఈ రెండు రీమేక్ లతో పాటు కె.
ఎస్ రవీంద్ర ఒరిజినల్ కథతో వాళ్తేర్ వీరయ్య సినిమా చేస్తున్నాడు చిరంజీవి.మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి పూర్తిస్థాయిలో మాస్ హీరోగా కనిపిస్తారని తెలుస్తుంది.
మెగా ఫ్యాన్స్ కి ఖచ్చితంగా వీరయ్య అదిరిపోయే ట్రీట్ అందిస్తారని అంటున్నారు.అంతేకాదు సినిమా లేటెస్ట్ పోస్టర్ లో 2023 సంక్రాంతికి కలుద్దాం అని వేశారు.
అంటే 2023 సంక్రాంతికి సినిమా రిలీజ్ పక్కా ఉంటుందని తెలుస్తుంది.