టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన నాగ చైతన్య, సమంతనటీనటులుగా తమకంటూ ఓ గుర్తింపును సంపాదించుకొని మంచి అభిమానం సంపాదించుకున్నారు.పైగా వీరిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు కూడా.
కానీ వీరి జీవితం విడాకులతో మూన్నాళ్ళ ముచ్చటగా మాత్రమే మిగిలిపోయింది.ఏం జరిగిందో తెలియదు కానీ సోషల్ మీడియా వేదికగా విడిపోతున్నామని గత ఏడాది ప్రకటించారు.
అలా అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ జంట ఎందుకు విడిపోయారు అనేది మాత్రం క్లారిటీ రాలేదు.ఇక వీరి పెళ్లి జరిగి నాలుగేళ్ల అవ్వగా.
పెళ్లి తర్వాత ఈ జంట టాలీవుడ్ ఇండస్ట్రీలో క్యూట్ కపుల్ గా నిలిచింది.నిజానికి ఈ జంట మరొకరికి ఈర్ష పుట్టించేలా కలిసి ఉన్నారు.
పైగా వీరి జంటను చూసిన ప్రతి ఒక్కరు ప్రేమ జీవితం ఇంత అద్భుతంగా ఉంటుందా అని అనుకున్నారు.ఇక పెళ్లి తర్వాత వీరిద్దరు కలిసి పలు సినిమాలలో, యాడ్స్ లలో నటించారు.
కొన్ని రియాలిటీ షోలలో కూడా పాల్గొని చాలా కబుర్లు చెప్పుకున్నారు.ఇద్దరు కలిసి ట్రిప్స్ కు వెళ్తూ బాగా ఎంజాయ్ చేశారు.
ఈ జంట మధ్య ఎటువంటి అడ్డు ఉండదని.ఎప్పటికైనా ఈ జంట ఇతర జంటలకు ఆదర్శంగా నిలుస్తుందని అందరూ అనుకున్నారు.
కానీ గత ఏడాది సమంత, నాగ చైతన్య సోషల్ మీడియా వేదికగా తాము విడిపోతున్నామని ప్రకటించారు.కారణం సమంత బోల్డ్ సీన్స్ చేయటంతో తన అత్త మామ అయిన నాగార్జున, అమల అలాంటి సీన్లలో నటించవద్దని అనడంతో.
దానికి సమంత నిరాకరించిందని బాగా పుకార్లు వచ్చాయి.కానీ ఇందులో ఎంత నిజముందో ఇప్పటికీ తెలియదు.
ఇక ఏది ఏమైనా ఈ ఇద్దరు విడిపోయి తమ కొత్త జీవితంలోకి అడుగు పెట్టారు.వరస ప్రాజెక్టులతో ఇద్దరు బాగా బిజీగా మారారు.
సమంత మాత్రం టాలీవుడ్ లోనే కాకుండా బాలీవుడ్ లో కూడా తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకుంది.ఇదిలా ఉంటే గత కొన్ని రోజుల నుంచి నాగచైతన్యపై వస్తున్న ఒక వార్త బాగా హాట్ టాపిక్గా మారిన సంగతి తెలిసిందే.నాగచైతన్య హీరోయిన్ శోభితా ధూళిపాళ తో డేటింగ్ లో ఉన్నాడు అని పుకార్లు రావడంతో.వెంటనే చైతన్య అభిమానులు.ఇదంతా సమంత కావాలని సృష్టిస్తుంది అని ట్వీట్ చేశారు.
దీంతో తాజాగా సమంత.చైతు ఫ్యాన్స్ కి డైరెక్ట్ ట్వీట్ చేసింది.అమ్మాయి పై పుకార్లు వస్తే నిజమే.
అదే అబ్బాయి పై పుకార్లు వస్తే అమ్మాయి చేయించింది అని.ఇకనైనా అబ్బాయిలు ఎదగండి అంటూ.మేము మూవ్ ఆన్ అయిపోయాం.మీ పని మీద, మీ కుటుంబాల మీద దృష్టి పెట్టండి అంటూ ట్వీట్ చేసింది.ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట్లో వైరల్ గా మారడంతో.నెటిజనులు రకరకాల కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.