ఎలా మొదలుపెట్టామని కాదు, ఏవిధంగా ముగింపు పలికాం అనేది కూడా ముఖ్యం.ఆహా పేరుకి తగ్గట్టుగానే ఎప్పుడూ ఆహా అనిపించుకునే షోస్ తో అందరిని అలరిస్తుంది.
అలాగే, ప్రపంచంలోనే అదిపెద్ద సంగీత వేదికైన ఇండియన్ ఐడల్ ను తెలుగు లో ప్రవేశపెట్టింది.ఈ జూన్ 3 న 15 వారాల సుదీర్ఘ ప్రయాణం తర్వాత చివరి ఘట్టంలోకి ప్రవేశిస్తుంది.
ప్రేక్షకుల మన్ననలు పొందిన ఈ షో లో మీకు నచ్చిన కంటెస్టెంట్స్ ని గెలిపించడానికి ఆహా చివరి అవకాశం ఇస్తుంది.జూన్ 3 నుండి జూన్ 6 ఉదయం 7 గంటల వరకు మీకు నచ్చిన పార్టిస్పెంట్ కు మీరు వోట్ వేసి, మొట్ట మొదటి తెలుగు ఇండియన్ ఐడల్ గా నిలబెట్టే అవకాశం మీ చేతుల్లోనే ఉంది.
మరి ఇంకా ఎందుకు ఆలస్యం, వోట్ వేయండి, తెలుగు ఇండియన్ ఐడల్ టైటిల్ ని మీ నచ్చిన కంటెస్టెంట్ ని గెలిపించండి.ఈ వారం మన ఆహా అభిమానులందరిని అలరించడానికి లెజెండరీ సింగర్ ఉష ఉత్తుప్ వస్తున్నారు.
కంటెస్టెంట్స్ పర్ఫార్మెన్స్ తో పాటు ఉష ఉత్తుప్ సంగీతంలో మైమరిచిపోవడానికి ఈ శుక్రవారం రాత్రి 9 గంటలకు సిద్ధంగా ఉండండి.