26 ఏళ్లుగా సైకిల్ చలివేంద్రంతో సేవలు చేస్తున్న వాటర్..!

నీరు.మనుగడకు ప్రాణావసరం.

 Shankar Lal Soni Has Been Serving With Cycle Chalivendram For 26 Years Cycle Coo-TeluguStop.com

మారుమూల గ్రామీణులు సైతం క్యాన్‌ నీటిని కొనుక్కొని తాగుతున్న పరిస్థితులున్న కాలం ఇది.ఇక ఎండాకాలం వచ్చిందంటే తాగు నీటి కోసం పడని పాట్లుండవు.సూర్యతాపం నుంచి తప్పించుకునేందుకు చల్లటి వాటర్, జ్యూస్ లను ఎక్కువగా సేవిస్తుంటారు.జలదానం ఎంతో పుణ్యమిస్తుంది.అన్ని దానాల వల్ల కలిగే పుణ్య ఫలం ఒక్క జల దానం వలన వస్తుందని చెప్పబడింది.అందుకే కొన్ని సేవా సంస్థలు, రాజకీయ నేతలు ప్రజల దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రాలను ఏర్పాటు చేస్తుంటారు.

కానీ ఓ వ్యక్తి మాత్రం ఎలాంటి లాభాపేక్ష లేకుండా ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో 26 ఏళ్లుగా ఉచితంగా నీటిని పంపిణీ చేస్తూ ‘జబల్​పుర్​ వాటర్​మ్యాన్​’గా గుర్తింపు పొందాడు.అతడే శంకర్​లాల్​ సోని.

శంకర్ లాల్ సోనీ… మధ్యప్రదేశ్ రాష్ట్రం జబల్ పూర్ లో వాటర్ మ్యాన్ గా పిలుస్తుంటారు.ఎందుకంటే ప్రజల దాహార్తిని తీర్చడంలో తనవంతు సాయం చేస్తున్నాడు.

సైకిల్.చుట్టూ సంచులు, నీళ్ల గ్లాసులు.

దూరం నుంచి చూడగానే మొబైల్ చాయ్ దుకాణంలా కనిపిస్తుంది.కానీ అది మొబైల్ చలివేంద్రం.

సైకిల్ పై వాటర్ బాటిళ్లు, వాటర్ స్టోరేజీ ప్యాకెట్లు తీసుకెళ్లి అందరి దాహం తీరుస్తున్నాడు.అందుకే జబల్ పూర్ వాసులు ఆయనను ముద్దుగా వాటర్ మ్యాన్ అని పిలుస్తుంటారు.

దాహం తీర్చిన శంకర్ లాల్ ఎవ్వరి దగ్గర నుంచి డబ్బులు తీసుకోడు.నిస్వార్థంతో ప్రజలకు సేవ చేస్తుంటాడు.

Telugu Season, Latest-Latest News - Telugu

ఎండాకాలంలో ప్రజలకు చల్లటి నీటిని అందిస్తున్నాడు శంకర్ లాల్.ప్రజలకు దాహం తీర్చడంలో ఒక ఆనందం ఉంటుందని దాన్ని మాటల్లో చెప్పలేము అంటున్నారు ఈ వాటర్ మ్యాన్.రోజులో అత్యధిక భాగం ఇలా సమాజ సేవకే కేటాయిస్తున్న శంకర్​లాల్​.నిత్యం సూర్యోదయానికి ముందే లేచి, ఇంటింటికీ తిరిగి పేపర్ వేస్తేనే అతడి కుటుంబానికి రోజు గడుస్తుంది.

అయినా కూడా అతను ప్రజల దాహార్తిని తీర్చడం మానుకోలేదు.సైకిల్ కు రెండు వైపులా 18 వాటర్ బాటిళ్లు, 18 వాటర్ బ్యాగులు తగిలించుకుని ప్రజల దాహాన్ని తీరుస్తున్నాడు.

దాదాపు 26 ఏళ్లుగా ఇదేవిధంగా చేస్తున్నాడు.నిస్వార్థంగా ప్రజలకు సేవ చేస్తున్నశంకర్ లాల్ పై అన్ని వర్గాల నుంచి ప్రశంసలు అందుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube