మరోసారి విలన్ గా విజయ్ సేతుపతి..!

కోలీవుడ్ విలక్షణ నటుడు విజయ్ సేతుపతి ఓ పక్క సోలో హీరోగా సినిమాలు చేస్తూనే మరోపక్క విలన్ గా అదరగొడుతున్నాడు.తమిళంలోనే కాదు తెలుగులో కూడా విజయ్ సేతుపతి విలన్ గా మెప్పించిన విషయం తెలిసిందే.

 Vijay Sethupathi Villain Ajith Movie Details, Vijay Sethupathi, Vignesh Shivan,-TeluguStop.com

ఉప్పెన సినిమాలో విజయ్ సేతుపతి విలనిజం సినిమాకే హైలెట్ గా నిలిచింది.ఇక కోలీవుడ్ లో అయితే ఎలాంటి ఛాన్స్ వచ్చినా సరే చేస్తాడు విజయ్ సేతుపతి.

ఆల్రెడీ మాస్టర్ సినిమాలో విజయ్ సేతుపతి విలన్ గా నటించిన సంగతి తెలిసిందే.లేటెస్ట్ గా మరో తమిళ్ సినిమాలో విజయ్ సేతుపతి విలన్ గా నటిస్తున్నాడని తెలుస్తుంది.

కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ హీరోగా టాలెంటెడ్ డైరక్టర్ విఘ్నేష్ శివన్ డైరక్షన్ లో ఓ సినిమా వస్తుంది.ఈ సినిమాలో విలన్ గా విజయ్ సేతుపతిని సెలెక్ట్ చేశారట.

కథ నచ్చి వెంటనే విలన్ గా విజయ్ సేతుపతి ఒప్పుకున్నారని తెలుస్తుంది.అజిత్ వర్సెస్ విజయ్ సినిమా హైప్ కు ఈ కాంబో చాలని చెప్పొచ్చు.

ఆల్రెడీ విఘ్నేష్ శివన్ డైరక్షన్ లో విజయ్ సేతుపతి కాతువాక్కుల రెండు కాదల్ సినిమా చేశాడు.అజిత్ సినిమాలో విలన్ గా మరోసారి విఘ్నేష్ శివన్ డైరక్షన్ లో చేస్తున్నాడు విజయ్ సేతుపతి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube