అగ్నిమాపక వారోత్సవాలు

సూర్యాపేట జిల్లా:అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా జిల్లా కేంద్రంలో అగ్ని ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అగ్నిమాపక అధికారి సి.

హెచ్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో శ్రీ వెంకటలక్ష్మి హీరో షోరూంలో మాక్ డ్రిల్ నిర్వహించారు.

వివిధ రకాల అగ్ని ప్రమాదాలు వాటి నివారణకు తీసుకోవలసిన చర్యలు,ప్రమాదం జరిగినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి,ప్రమాదం జరిగినప్పుడు వివిధ రకాల పరికరాల వాడకంపై అవగాహన కల్పించారు.గ్యాస్ సిలిండర్ నుండి గ్యాస్ లీక్ అయినప్పుడు భయపడకుండా దుప్పటిని తడిపి సిలిండర్ చుట్టూ కప్పి ఆర్పే ప్రయత్నం చేయాలని అగ్నిమాపక అధికారి అవగాహన కల్పించారు.

ఉద్యోగులందరిని అగ్ని వంటి ప్రదేశాలను గుర్తించినట్లు చేయండని,వారికి బేసిక్ ఫైర్ ఫైటింగ్ లో శిక్షణ ఇవ్వాలన్నారు.ఎలక్ట్రికల్ ఫైర్ జరిగినప్పుడు ప్రథమంగా మెయిన్ స్విచ్ ఆఫ్ చేసిన తర్వాత సంబంధిత ఫైర్ ను ఆర్పడానికి ప్రయత్నించాలని తెలిపారు.

విద్యుత్ ప్రవహిస్తున్న వైర్లపై అత్యవసర పరిస్థితులలో కార్బన్ డయాక్సైడ్ ఎక్సటింగుషర్ ఉపయోగించాలని,ఫైర్ ఇవాక్యుయేషన్ డ్రిల్లును ప్రతి మూడు నెలలకు ఒకసారి క్రమం తప్పకుండా ప్రాక్టీస్ చేయాలని,పరిసరాల శుభ్రతను పాటిస్తూ ఆవరణలో చెత్తాచెదారం ప్రోగు పడకుండా చూడాలని సూచించారు.ఏదైనా అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు వెంటనే 101 కి కాల్ చేయాలని చెప్పారు.

Advertisement

ఈ కార్యక్రమంలో శ్రీ వెంకటలక్ష్మి హీరో షోరూం ఎండి రాచర్ల కమలాకర్ మరియు వారి సిబ్బంది,సూర్యాపేట అగ్నిమాపక సిబ్బంది లీడింగ్ ఫైర్ మాన్ శంకర్,ఫైర్ మాన్ శ్రీనివాసరావు, ప్రవీణ్ కుమార్,సత్యనారాయణ,డిఓపి సత్యనారాయణ మరియు వెంకన్న తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

భువనగిరి ఖిల్లాపై కాంగ్రెస్ జెండా ఎగరవేస్తాం : ఎమ్మెల్యే మందుల సామేల్
Advertisement

Latest Suryapet News