చరణ్ శంకర్ కాంబినేషన్ లో దిల్ రాజు నిర్మాతగా ఒక సినిమా తెరకెక్కుతుండగా ఈ సినిమ బడ్జెట్ హద్దులు దాటుతోందనే కామెంట్లు వినిపిస్తున్నాయి.దిల్ రాజు ఈ సినిమా కోసం ఏకంగా 300 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి.
ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఒక ఫైట్ సీన్ ను, పాటను షూట్ చేశారని పాటకు తొమ్మిది కోట్ల రూపాయలు, ఫైట్ కు పది కోట్ల రూపాయలు ఖర్చైందని సమాచారం అందుతోంది.
వచ్చే ఏడాది సంక్రాంతి టార్గెట్ గా ఈ సినిమా షూటింగ్ జరుగుతుండగా ఈ సినిమాకు సర్కారోడు అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారని సమాచారం అందుతోంది.
చరణ్ ఈ సినిమాలో రెండు పాత్రల్లో కనిపిస్తారని ఒక పాత్రలో స్టూడెంట్ గా మరో పాత్రలో ప్రభుత్వ ఉద్యోగిగా చరణ్ కనిపిస్తారని బోగట్టా.చరణ్ కాలేజ్ స్టూడెంట్ గా కనిపించే సన్నివేశాలను అమృత్ సర్ లో షూట్ చేయనున్నారని సమాచారం అందుతోంది.
ఈ సినిమా సంక్రాంతికి విడుదలవుతుందని చెబుతున్నా సినిమా రిలీజ్ వాయిదా పడే అవకాశాలు ఉన్నాయని ఇండస్ట్రీలో వినిపిస్తోంది.
చరణ్ కు జోడీగా ఈ సినిమాలో కియారా అద్వానీ నటిస్తుండగా చరణ్ కియారా కాంబో సీన్లు సినిమాకు హైలెట్ గా నిలవనున్నాయని సమాచారం అందుతోంది.వైజాగ్, రాజమండ్రిలోని పరిసర ప్రాంతాలలో కూడా ఈ సినిమా షూటింగ్ జరిగిందని తెలుస్తోంది.శంకర్ మరోసారి ఖర్చు విషయంలో రాజీ పడకుండా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారని తెలుస్తోంది.
ఈ మధ్య కాలంలో శంకర్ సినిమాలు సక్సెస్ సాధిస్తున్నా ఆ సినిమాలు శంకర్ స్థాయికి తగిన సినిమాలు కావని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.ఆర్ఆర్ఆర్ సినిమాతో కెరీర్ బిగ్గెస్ట్ హిట్ ను సొంతం చేసుకున్న చరణ్ తర్వాత సినిమాలతో కూడా మంచి ఫలితాలను అందుకుంటారేమో చూడాల్సి ఉంది.