యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా రాజమండ్రి రోజ్ మిల్క్

కొత్తదనంతో కూడిన చిత్రాలను ఆదరించడంలో మన ప్రేక్షకులు ముందు వరుసలో వుంటారు.రొటిన్ ఫార్ములాను బ్రేక్ చేస్తూ వచ్చే వైవిధ్యమైన చిత్రాలకు పెద్దపీట వేస్తారు.

 Rajahmundry Rose Milk As Youthful Entertainer , Rajahmundry , Rose Milk, Youthfu-TeluguStop.com

ఇప్పుడు అలాంటి కోవలోనే రాబోతున్న మరో చిత్రం రాజమండ్రి రోజ్ మిల్క్.ఉగాది సందర్భంగా ఈ చిత్రం టైటిల్ పోస్టర్‌ను విడుదల చేశారు.

నాని బండ్రెడ్డి దర్శకత్వంలో ప్రముఖ నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్స్, తో కలిసి ఇంట్రూప్ నిర్మాణ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది.డి.సురేష్‌బాబు, ఉప్పలపాటి ఉప్పలపాటి నిర్మాతలు.జై జాస్తి, అవంతిక ముఖ్యతారలుగా నటిస్తున్న ఈ చిత్రంలో ప్రముఖ హాస్య నటులు వెన్నెల కిషోర్, ప్రవీణ్‌లు చిత్రంలో కీలకపాత్రలో నటిస్తున్నారు.

వీరితో పాటు ధరహాస్, వెంకట్‌గణేష్, హేమంత్ మధుమణి, ప్రీతినిగమ్‌లు ఇతర పాత్రల్లో కనిపిస్తారు.ప్రస్తుతం రాజమండ్రిలో చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ చిత్రం విశేషాలను దర్శకుడు నాని బండ్రెడ్డి తెలియజేస్తూ ఇటీవల చిత్రీకరణ ప్రారంభించాం.

పూర్తి వినోదాత్మకంగా రూపొందుతున్న ఈ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ అందరికి కాలేజీ రోజులను గుర్తుచేస్తుంది.కాలేజీ రోజుల్లో జరిగిన మరపురాని సంఘటనలను ఈ చిత్రం జ్ఞప్తికి తెస్తుంది అన్నారు.

ఈ చిత్రానికి సంగీతం: జస్టిన్ వర్గీస్, గోవింద్ వసంత్, అజయ్ అరసాడ, యశ్వంత్ నాగ్, భరత్-సౌరభ్, డీఓపీ: ముఖేష్.జి, సాహిత్యం: చంద్రబోస్, అనంత్‌శ్రీరామ్, శ్రీమణి.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube