బీజేపీ ముందు భారీ సవాళ్ళు.. సమర్థవంతంగా ఎదుర్కొనేనా?

తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు రోజురోజుకు అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతుండటంతో ఒక్కసారిగా హీటెక్కుతున్న పరిస్థితి ఉంది.అయితే తెలంగాణలో రోజురోజుకు బీజేపీ బలపడాలని పెద్ద ఎత్తున ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే.

 Big Challenges Before Bjp .. Can It Be Faced Effectivel Bjp Party, Kcr, Ts Pol-TeluguStop.com

అయితే ప్రస్తుతం బీజేపీ ముందు చాలా రకాల సవాళ్ళు ఉన్నాయి.అందులో ఉన్నవి పెట్రోల్, డీజిల్ ధరలు ఒకటి కాగా యాసంగీ వరి ధాన్యం కొనుగోలు అంశం.

డీజిల్, పెట్రోల్ ధరలపై, యాసంగి వరి ధాన్యం కొనుగోలు అంశంపై టీఆర్ఎస్ మెల్లమెల్లగా పట్టు బిగిస్తున్న పరిస్థితుల్లో బీజేపీ  సరైన సమాధానం ఇవ్వడంలో వెనుకంజలో ఉన్న పరిస్థితి ఉంది.ఇప్పుడు ఇంకా తీర్మాణాల ద్వారానే నిరసనలు మొదలు పెట్టిన టీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే ఉగాది తరువాత ఉగ్రరూపమే అని తెలిపిన నేపథ్యంలో పెద్ద ఎత్తున కేంద్రమే యాసంగీ వరి ధాన్యం కొనుగోలు చేయడం లేదనే విషయం పెద్ద ఎత్తున ప్రజల్లోకి వెళ్తే రాజకీయంగా బీజేపీకి మనుగడ అనేది మరింత కష్టతరంగా మారే అవకాశం ఉంది.

అయితే ఎంత మేరకు ఈ విషయాన్ని సమర్థవంతంగా ఎదుర్కొంటుందనేది రానున్న రోజుల్లో తెలిసే అవకాశం ఉంది.అయితే ఇప్పుడు తీర్మాణాల నిరసనల తరువాత ఎలాంటి అడుగు వేస్తుందనేది ఇప్పుడు రాజకీయ వర్గాలలో పెద్ద ఎత్తున జరుగుతున్న చర్చ.

ఇటు పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలతో ప్రజల్లో బీజేపీపై పెద్ద ఎత్తున ఆగ్రహం అనేది పెల్లుబుకుతున్న నేపథ్యంలో వరి ధాన్యం కొనుగోలు విషయం కూడా ప్రజల్లోకి వెళ్తే ఇక టీఆర్ఎస్ పై ఎంతగా వ్యతిరేక ప్రచారం చేసినా ఆ వ్యూహం విఫలమవడమే కాకుండా బీజేపీపై ప్రజల్లో వ్యతిరేకత అనేది పెరిగే అవకాశంతో పాటు ఇక కెసీఆర్ చేతికి బీజేపీ చిక్కే అవకాశం వందకు వంద శాతం ఉందని మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube