చాలా మంది భూత ప్రేత పిశాచాలకు ఆ భోళా శంకరుడే అధిపతి అనుకుంటూ ఉంటారు.అంతే కాకుండా అది నిజమేనని నమ్మించ డానికి చెప్తుంటూ… అందుకే శివుడు శ్మశానాల్లో ఉంటాడని కూడా చెప్తుంటారు.
అయితే దేవుడు దయ్యాలకు అధిపతి ఏంటని కూడా చాలా మంది అనుమానం వ్యక్తం చేస్తుంటారు.అయితే ఇందులో నిజమెంత ఉంది.
నిజంగానే శివుడు భూత ప్రేత పిశాచాలకు అధిపతి శివుడేనా.అందుకే ఆ భోళా శంకరుడు శ్మశానాల్లో ఉంటాడా లేదా అనే విషయం మనం ఇప్పుడు తెలుసు కుందాం.
శివుడు సృష్టి స్థితి లయకర్తలైన త్రిమూర్తుల్లో ఒకడు.ఈ విశ్వానికి లయకర్త.
క్రూర ప్రవృత్తి గల భూత పిశాచాలు ప్రజలను బాధించే స్వభావం కల్గి ఉండేవి.సృష్టికర్త అయిన బ్రహ్మవాటి దుశ్చర్యలకు ప్రతీకారం చేయ వలసిందిగా శివుని ప్రార్థించాడు.
అందుకు అంగీకరించి శివుడు జన సంచారం లేని చోటు తనకు కావాలనీ… అక్కడ ఉండి భూత ప్రేత పిశాచాదులను నిగ్రహించ గలననీ చెప్పాడు.ఆపై శివుడు జన సంచారం లేని శ్మశాన వాటికలో నివసించే ఏర్పాటు జరిగింది.
అక్కడ ఉండి శివుడు భూతాదులను నిగ్రహిస్తూ.ఉన్నాడు.
కాని వాటికి అధిపతి అయ్యాడు.స్కాంద పురాణంలోని బ్రహ్మోత్తర ఖండంలో శివ కవచ స్తోత్ర ప్రభావం చెప్ప బడింది.
ఆ ప్రభావ వర్ణనలో ఇత్యాదిగా భూతాదులను నిగ్రహించే మంత్రాలు శివుడిని ఉద్దేశించి పై కారణం వల్లనే ఉచ్చరించ బడుతున్నాయి.శివుడు మనుషుల సుఖంగా జీవించాలనే ఉద్దేశంతోనే దెయ్యాలను అదుపు చేసేందుకు శ్మశానంలో ఉంటాడు.