వామ్మో ప్రభాస్ కోసం షూటింగ్ కి డుమ్మా కొట్టిన హీరో... ఎవరంటే?

నేషనల్ స్టార్ ప్రభాస్ కి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందనే విషయం మనకు తెలిసిందే.ఈ క్రమంలోనే బాహుబలి సాహో సినిమాల తర్వాత ప్రభాస్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నటించిన రాధేశ్యామ్ సినిమా ఈ నెల 11వ తేదీ విడుదల కానుంది.

 Udayanidhi Stalin Who Put Leave To Shooting For Prabhas Movie Details, Prabhas,-TeluguStop.com

ఐదు భాషల్లో ఏక కాలంలో ఈ సినిమా విడుదల కానుంది.ఈ క్రమంలోని ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేశారు.

ఇప్పటికే ముంబైలో ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను ఎంతో ఘనంగా నిర్వహించిన చిత్ర బృందం చెన్నైలో కూడా ఫ్రీ రిలీజ్ వేడుకను నిర్వహించారు.

ఇక ఈ ప్రీ రిలీజ్ వేడుకకు రాధేశ్యామ్ చిత్రబృందం మొత్తం హాజరుకాగా తమిళనాడు ముఖ్యమంత్రి కుమారుడు, హీరో, ఎమ్మెల్యే ఉదయనిది స్టాలిన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ప్రీ రిలీజ్ వేడుకల్లో భాగంగా ఉదయనిది స్టాలిన్ మాట్లాడుతూ… నాకు ఈ రోజు షూటింగ్ ఉన్నా కూడా ప్రభాస్ సినిమా కోసం షూటింగుకు లీవ్ పెట్టి వచ్చానని చెప్పడం ఎంతో ఆసక్తికరంగా మారింది.

అయితే ఉదయనిధి స్టాలిన్ ప్రభాస్ పై ఉన్న అభిమానంతో ఇలా తన షూటింగ్ కి డుమ్మా కొట్టారా అనుకుంటే పొరపాటే… తమిళనాడులో పాటు మలేషియా వంటి దేశాలలో కూడా ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ సినిమాని ఉదయనిధి స్టాలిన్ విడుదల చేయడంతో ఈయన ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొన్నారు.ఈ విధంగా తమిళనాడులో ప్రభాస్ సినిమాకి ఏకంగా ఉదయనిధి స్టాలిన్ సపోర్ట్ ఉండడంతో తమిళనాడులో ఈ సినిమాకి ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం కావనే విషయం తెలుస్తుంది.

Udayanidhi Stalin Who Put Leave To Shooting For Prabhas Movie Details

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube