తెలంగాణ రాజకీయాలు రోజురోజుకు సంచలన మలుపులతో పెద్ద ఎత్తున రణరంగంగా మారుతున్న విషయం తెలిసిందే.అయితే ప్రస్తుతం ప్రశాంత్ కిషోర్ వ్యూహంలో భాగంగా రాజకీయ వాతావరణం ఒక్కసారిగా మారిపోతున్న పరిస్థితి ఉంది.
మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్ర పన్నారనే ఆరోపణలతో నిన్న సైబరాబాద్ పోలీసులు నిన్న విలేఖరుల సమావేశంలో వివరాలు వెల్లడించిన విషయం తెలిసిందే.అయితే ఈ హత్యాయత్నం కేసుకు సంబంధించి ఇంకా కేసీఆర్ నుండి కాని టీఆర్ఎస్ పార్టీ నుండి అంతగా స్పందన లేదు.
అయితే ఈ ఘటనపై కేసీఆర్ నుండి ఇంకా స్పందన లేకున్నా రానున్న రోజుల్లో స్పందించే అవకాశం కనిపిస్తోంది.
అయితే ప్రశాంత్ కిషోర్ వ్యూహంతో ఇంకా రానున్న రోజుల్లో పరిస్థితులు పూర్తిగా మారిపోయే అవకాశం ఉంది.
అయితే బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు సమర్థవంతంగా టీఆర్ఎస్ ఎత్తుగడలను పూర్తిగా తిప్పికొడుతున్న తరుణంలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కుతోంది.అయితే ప్రస్తుతం టీఆర్ఎస్ పార్టీ నుండి పెద్ద ఎత్తున విమర్శల వర్షం కురిసే అవకాశం ఉంది.
ప్రస్తుతం బీజేపీ పార్టీ మంత్రిపై హత్యాయత్నం కుట్ర అనేది భూటకమని విమర్శిస్తున్న సంగతి తెలిసిందే.కాంగ్రెస్ పార్టీ మంత్రిపై హత్యాయత్నం ఘటనకు సంబంధించి ఇంకా స్పందించకపోయినా రానున్న రోజుల్లో స్పందించే అవకాశం కనిపిస్తోంది.తెలంగాణలో ఇక రానున్న రోజుల్లో మరింతగా కెసీఆర్ వ్యూహాత్మకంగా ప్రయాణించే అవకాశం ఉంది.అయితే మునుపెన్నడూ లేనంతగా రాజకీయం మాత్రం ఉండే అవకాశం లేదు.