శివరాత్రి రోజు పరమేశ్వరుడి అనుగ్రహం కలగాలంటే ఈ పనులు చేయాల్సిందే!

మహా శివరాత్రి పండుగను హిందూ ప్రజలు ఎంతో ఘనంగా జరుపుకుంటారు.ప్రతి ఏడాది ఈ పండుగ ఫాల్గుణ మాసంలో జరుపుకుంటారు.

 If You Want To Get Blessings Of God On-the Day Of Shivaratri You Have To Do Thes-TeluguStop.com

ఇకపోతే మహాశివరాత్రి పండుగ రోజు ఆ పరమేశ్వరుడికి ప్రత్యేకంగా పూజలు చేసి ఆ శివయ్య అనుగ్రహం కోసం భక్తులు కఠిన ఉపవాసంతో పూజలు చేస్తుంటారు.ఈ క్రమంలోనే మహా శివరాత్రి పండుగ రోజు దేశంలో ఉన్న శివాలయాలు శివనామస్మరణతో మార్మోగిపోతాయి.

శివుడు అభిషేక ప్రియుడు కనుక చాలా మంది మహా శివరాత్రి రోజు స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు పూజలు చేస్తుంటారు.

ఇక మహాశివరాత్రి రోజు పరమేశ్వరుడికి అభిషేకంతో పాటు కొన్ని పనులు చేయడం వల్ల స్వామివారి అనుగ్రహం పొందుతాము.

మహా శివరాత్రి రోజు స్వామివారి అనుగ్రహం పొందాలంటే స్వామి వారికి అభిషేకము ఉపవాసము జాగరణ ఈ మూడు పనులు ఎంతో నిష్టతో చేయడం వల్ల శివుడి అనుగ్రహం ఎల్లవేళలా మనపై ఉండి మన కోరికలు నెరవేరుతాయి.సాగర మధనం చేస్తున్న సమయంలో స్వామివారు కాలకూట విషం మింగటం వల్ల ఆయన కంఠంలో ఆ విషం ఉండటం వల్ల శివుడి దేహం మొత్తం ఎంతో మంటగా ఉంటుంది.

అందుకే శివుడి వేడిని తగ్గించడం కోసం అభిషేకం చేయాలి.

అలాగే స్వామివారికి కఠిన ఉపవాసాలతో పూజ చేయడం వల్ల స్వామివారి అనుగ్రహం ఎల్లవేళలా మనపై ఉంటుంది.ఇక శివరాత్రి రోజు భక్తిశ్రద్ధలతో స్వామి వారి భజనలు చేస్తూ తెల్లవారులు జాగరణ చేయాలి ఈ మూడు పనులను స్వామివారికి నిష్ఠతో చేయటం వల్ల స్వామివారి కరుణ కటాక్షాలు ఎల్లవేళలా మనపై ఉంటాయి.ఇక స్వామి వారికి శివరాత్రి రోజు ఈ 3 పనులు చేయడంవల్ల ప్రతి ఒక్కరు స్వామివారి కృపకు పాత్రులు కాగలరు.

If You Want To Get Blessings Of God On

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube