ఇటీవలి కాలంలో బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో విడాకులు అనేది సర్వసాధారణంగా మారిపోయింది.ఇలా విడాకులు తీసుకుంటున్న వారిలో ప్రేమించి పెళ్లి చేసుకున్న సెలబ్రిటీలు కొంత మంది ఉంటే.
పెద్దలు చేసిన పెళ్లి చేసుకున్న వారు మరికొంతమంది.ఏ పెళ్లి అయితే ఏంటి విడాకులు మాత్రం తీసుకోవడంలో ఎవరు కాస్తయినా ఆలోచించడం లేదు.
ఎన్నో ఏళ్ల పాటు కలిసి ఉండి లైఫ్ లీడ్ చేసిన వారు ఆ తర్వాత వివిధ కారణాల తో కలిసి ఉండలేక వైవాహిక బంధానికి గుడ్ బై చెప్పేస్తున్నారు.ఇక ఆ తర్వాత రెండో పెళ్లి కోసం సిద్ధమవుతున్న వారు చాలా మంది ఉన్నారు.వాళ్ళు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.
బాలీవుడ్ హీరో డైరెక్టర్ ఫర్హాన్ అక్తర్ రెండో పెళ్ళికి సిద్ధమయ్యాడు.
తన గర్ల్ ఫ్రెండ్ షిబా దండేకర్ తో పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు ఈ హీరో.పదహారేళ్ళ వైవాహిక బంధం నుంచి ఇటీవలే విడాకులతో వేరుపడిన ఫర్హాన్ అక్తర్ ఆ తర్వాత శిబా దండేకర్ తో ప్రేమలో పడ్డాడు.
ఇక ఇటీవలే పెళ్లితో ఒక్కటయ్యారు.
అర్జున్ కపూర్ మలైక ఆరోరా రిలేషన్ షిప్ ఎప్పుడు హాట్ టాపిక్ గా మారుతూ ఉంటుంది.
అర్జున్ కపూర్ కంటే వయసులో ఎంతో పెద్దదైన మలైక ఆరోరా ఇక ఇప్పుడు అతనిని పెళ్లి చేసుకునేందుకు కూడా సిద్ధమైంది.సల్మాన్ ఖాన్ తమ్ముడు అర్బాజ్ ఖాన్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది మలైక ఆరోరా.కానీ ఆ తర్వాత విడాకులతో వీరిద్దరూ వేరు పడ్డారు.ఇక ఆ తర్వాత యంగ్ హీరో అర్జున్ కపూర్ తో ప్రేమలో పడింది మలైక ఆరోరా.త్వరలో వీరు పెళ్లి చేసుకోబోతున్నారనే టాక్ వినిపిస్తోంది.మరోవైపు విడాకుల తర్వాత అర్బాజ్ ఖాన్ సైతం జార్జియా ఆండ్రియా తో రిలేషన్ లో కొనసాగుతున్నాడు.
ఇక వీరిద్దరు కూడా పెళ్ళి చేసుకోవాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది.
బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ ఆయన భార్య సూజానేతో పదిహేనేళ్లు కలసి జీవించిన తర్వాత విడాకులు తీసుకున్నాడు.ఇటీవల యువ హీరోయిన్ సభ ఆజాద్ తో ప్రేమ లో ఉన్నాడు హృతిక్ రోషన్.ఇక ఇద్దరూ కలిసి అన్ని పార్టీలకు చెట్టాపట్టాలేసుకొని తిరుగుతున్నారూ.
ఇక త్వరలో వీరిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ టాక్ వినిపిస్తోంది.
ఇక బాలీవుడ్ లో హాట్ హీరోయిన్ గా గుర్తింపు సంపాదించుకున్న కిమ్ శర్మ, లియాండర్ ఫేస్ కూడా రెండో పెళ్ళికి సిద్ధమైపోయారట.టెన్నిస్ స్టార్ లియాండర్ పేస్ 30 ఏళ్ల క్రితం పెళ్లి చేసుకున్నాడు.కానీ ఇటీవలే మనస్పర్థలు రావడంతో విడాకులు తీసుకున్నాడు.
ఇప్పుడు కిమ్ శర్మతో రిలేషన్ షిప్ లో ఉన్నాడు.త్వరలో వీరి రిలేషన్ షిప్ పెళ్లితో అఫీషియల్ చేయాలి అని అనుకుంటున్నారట.