మన దేశంలో ప్రతీ వంద కిలోమీటర్లకు జనం భాష, వేషధారణ మారుతుంటుంది.ఈ క్రమంలోనే ఆహారపు అలవాట్లు కూడా చేంజ్ అవుతుంటాయి.
అయితే, దాదాపుగా అందరూ మార్నింగ్ టైమ్స్ లో తీసుకునే టిఫిన్స్ లో దోశ అయితే ఉంటుంది.ఇకపోతే ఏ ప్రాంతానికి తగ్గట్లు ఆ ప్రాంత స్పెషల్ దోశలు తయారు చేస్తుంటారు.
అందరూ దోశను మార్నింగ్ టైం టిఫిన్‌గా ఇష్టంగా తీసుకుంటారు కూడా.కాగా, మీకు దోశ బాగా ఇష్టం అయితే ఈ వెరైటీ దోశకు సంబంధించిన ఆఫర్ మీరు తెలుసుకోవాల్సిందే.
సోషల్ మీడియాలో ఈ దోశకు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం తెగ వైరలవుతోంది.ఇందులో పది అడుగుల దోశ గురించి బంఫర్ ఆఫర్ ఇచ్చారు.వివరాల్లోకెళితే.ఎవరైనా కానీ పది అడుగుల దోశను తిన్నట్లయితే వారు ఆ దోశకు బిల్లు కట్టాల్సిన అవసరం లేదు.దాంతో పాటు వారికి రూ.71 వేల ప్రైజ్ మనీ కూడా ఇస్తామని ఓ రెస్టారెంట్ ప్రకటించింది.ఆ రెస్టారెంట్ ఎక్కడుందంటే.
మన దేశ రాజధాని ఢిల్లీలోని బిందాపుర్‌లోని శక్తి సాగర్ రెస్టారెంట్ ఈ ఆఫర్ ప్రకటించింది.
పది అడుగుల పొడవుండే ఆ పొడవాటి దోశ తిన్నట్లయితే బంపర్ ఆఫర్ ఇస్తామని ప్రకటించింది రెస్టారెంట్ యాజమాన్యం.రెస్టారెంట్ ఎవ్రీ వీకెండ్స్ లో డిఫరెంట్ డిఫరెంట్ టిఫిన్స్ తయారు చేస్తుంటుంది.
ఈ క్రమంలోనే పది అడుగుల పొడవుండే ఈ దోశను తయారు చేసింది.దీని ఖరీదు రూ.1,500గా ఫిక్స్ చేసింది.అయితే, ఈ దోశను తిన్నట్లయితే వారికి ప్రైజ్ మనీ ఇస్తామని రెస్టారెంట్ యాజమాన్యం చెప్పింది.అలా మీరు ఈ దోశను తిన్నట్లయితే రూ.71,000 ఇస్తామని పేర్కొంది.ఇంకెందుకు ఆలస్యం మరి.మీరు భోజన ప్రియులు అయితే, చక్కగా వెళ్లి అక్కడ దోశ తినడానికి ట్రై చేసి .రూ.71 వేలు గెలుచుకునేందుకుగాను ప్రయత్నించండి.