బిగ్ బాస్ చిచ్చు రగిలింది... షణ్నుకు బ్రేకప్ చెప్పేసిన దీప్తి సునైనా?

బిగ్ బాస్ ఫైవ్ రన్నరప్ గా నిలిచిన షణ్ముఖ్ జస్వంత్, అతడి ప్రియురాలు దీప్తి సునైనా గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.వీరిద్దరూ గత కొన్ని రోజులుగా ప్రేమించుకుంటున్న విషయం తెలిసిందే.

 Bigg Boss Telugu 5, Deepthi Sunaina, Shanmukh, Break Up, Siri-TeluguStop.com

ఇదిలా ఉంటే తాజాగా దీప్తి సునైనా న్యూ ఇయర్ సందర్భంగా ప్రియుడు షణ్ముఖ్ కు ఊహించని షాక్ ఇచ్చింది.న్యూ ఇయర్ సందర్భంగా అతడితో కలిసి దిగిన ఫోటో ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంది అని అభిమానులు భావించారు.

కానీ దీప్తి సునైనా మాత్రం ఊహించని విధంగా షణ్ముఖ్ జస్వంత్ కి బ్రేక్ అప్ అంటూ షాక్ ఇచ్చింది.

గత కొద్ది రోజులుగా వీరిద్దరు విడిపోతున్నారు అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే.

ఇక దీప్తి సునైనా అదే వార్తలను నిజం చేస్తూ సోషల్ మీడియా వేదికగా విడిపోతున్నట్లు ప్రకటించింది.అయితే ఆ విషయంపై షణ్ముఖ్ జస్వంత్ ఇంకా స్పందించలేదు.

షణ్ముఖ్ జస్వంత్ బిగ్ బాస్ సీజన్ ఫైవ్ లోకి కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.ఇక బిగ్ బాస్ హౌస్ లో షణ్ముఖ్ జస్వంత్ సిరితో చేసిన రచ్చ అంతా ఇంతా కాదు.

బిగ్ బాస్ హౌస్ లో ముద్దులు, హగ్గులతో రెచ్చిపోయారు.బెడ్ పై ఓకే దుప్పట్లో ఇద్దరు కలిసి పడుకోవడం, ప్రతి చిన్నదానికి ఎమోషనల్ అవుతూ హగ్ చేసుకోవడం పై వారిద్దరినీ ఏకిపారేస్తూ దారుణంగా ట్రోలింగ్స్ కూడా చేశారు.

షణ్ముఖ్ జస్వంత్ ఆట పై కంటే సిరి పై ఎక్కువ దృష్టి పెట్టారనే విమర్శలు కూడా వచ్చాయి.

అంతేకాకుండా సిరి తల్లి బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చి వారిద్దరి పద్ధతులు మార్చుకోమని చెప్పినప్పటికీ వారిద్దరి ప్రవర్తనలో మార్పు రాలేదు.ఇక బిగ్ బాస్ హౌస్ లోకి షణ్ముఖ్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత షన్ను బర్త్ డే రోజు అతనికి ఐ లవ్ యు చెప్పింది, అనంతరం బిగ్ బాస్ స్టేజి పైకి వచ్చి కళ్ళతోనే ఆల్ ది బెస్ట్ చెప్పి వెళ్ళిపోయింది.అనంతరం సిరి ప్రియుడు శ్రీహాన్ బిగ్ బాస్ స్టేజి పైకి వచ్చి ఎమోషనల్ అవుతూ సిరి నన్ను వదిలేస్తావా అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు.

ఇక దీప్తి సునైనా కూడా బిగ్ బాస్ సీజన్ 2 లో నటుడు తనీష్ తో చనువుగా ఉండేది.బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చాక షణ్ముఖ్, దీప్తి లు విడిపోయారు అంటూ వార్తలు వినిపించాయి .ఇలాంటి వార్తలను షణ్ముఖ్ అభిమానులు ప్రస్తావిస్తూ ఉంటారు.ఆ తర్వాత వారిద్దరు కూడా అందులో ఎటువంటి నిజం లేదు అంటూ ఆ వార్తలను ఖండించారు.

ఇక ప్రస్తుతం దీప్తి సునైనా పెట్టిన పోస్ట్ పై షణ్ముఖ్ స్పందించలేదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube