పెళ్లి కూతురిలా సాయి పల్లవి.. ఫోటోలు వైరల్?

నేచురల్ బ్యూటీ సాయిపల్లవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.తాజాగా సాయి పల్లవి గురించి ఒక విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

 Sai Pallavi As A Bride Photos Viral Details, Sai Pallavi, Tollywood, Heroine, B-TeluguStop.com

సాయి పల్లవి ఒక ప్రముఖ హీరోను పెళ్లి చేసుకుందని ఆమె పెళ్లి కూతురు గెటప్ లో ఉన్నటువంటి ఫోటో పెద్ద ఎత్తున వైరల్ అవుతోంది.ఇంతకీ ఆమె ఏ హీరోని పెళ్లి చేసుకుంది? పెళ్లి ఎప్పుడు జరిగింది? అనుకుంటున్నారా అయితే ఇది రియల్ పెళ్లి కాదండోయ్.రీల్ పెళ్లి.

నాని, సాయి పల్లవి జంటగా రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం “శ్యామ్ సింగరాయ్”.ఈ సినిమా క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 24వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.ఈ క్రమంలోనే చిత్రబృందం పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహించారు.

కలకత్తా బ్యాక్ డ్రాప్ పునర్జన్మల కథాంశంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాలో నాని ద్విపాత్రాభినయంలో నటించగా సాయి పల్లవి, కృతి శెట్టి హీరోయిన్లుగా నటిస్తున్నారు.

ఈ సందర్భంగా నాని సోషల్ మీడియా ద్వారా ఈ సినిమాకి సంబంధించి ఒక ఫోటోని షేర్ చేశారు.ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఇందులో ద్విపాత్రాభినయంలో నటించే నాని కలకత్తా సాంప్రదాయంలో సాయి పల్లవిని పెళ్లి చేసుకున్న ఫోటోను తన సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు.

ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఇకపోతే ఈ సినిమా డిసెంబర్ 24వ తేదీ విడుదల కానుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube