నానికి ఇష్టమైన బ్రాండ్ ఇదే.. బాలయ్యతో కలిసి ఆ మూవీ చేస్తానంటూ?

న్యాచురల్ స్టార్ నాని ఈ మధ్య కాలంలో నటించిన సినిమాలు వరుసగా ఫ్లాప్ అయిన సంగతి తెలిసిందే.అయితే న్యాచురల్ స్టార్ నాని భారీ బ్లాక్ బస్టర్ హిట్ తో ప్రేక్షకుల ముందుకు వస్తారని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

 Nani Reveals His Liquor Habit In Unstoppable Show Details, Balakrishna, Interest-TeluguStop.com

కొన్నేళ్ల క్రితం నాని బిగ్ బాస్ సీజన్2 కు హోస్ట్ గా వ్యవహరించి ఆ షోను హిట్ చేసిన విషయం తెలిసిందే.తాజాగా నాని బాలయ్య హోస్ట్ గా ప్రసారమవుతున్న అన్ స్టాపబుల్ షోకు వచ్చారు.

బాలయ్య ఈ షోలో నానీతో మాట్లాడుతూ తాను ఉదయం నుంచి రాత్రి వరకు కష్టపడతానని రిలాక్స్ కావడం కోసం సాయంత్రం సమయంలో నాన్న నటించిన సినిమాలను చూస్తానని ఇంకొంచెం రిలాక్స్ కావడానికి మాన్షన్ హౌజ్ తాగుతానని చెప్పుకొచ్చారు.మరి నువ్వు ఏ విధంగా రిలాక్స్ అవుతావంటూ బాలయ్య నానిని ప్రశ్నించారు.

నాని ఆ ప్రశ్నకు సమాధానం ఇస్తూ రిలాక్స్ కావాలంటే ఏదో ఒక మూవీ చూడాల్సిందేనని చెప్పారు.

రిలాక్స్ కావడానికి తాను మ్యూజిక్ వింటానని నాని అన్నారు.

అప్పుడప్పుడూ రెడ్ వైన్ తాగుతానని నాని తన సీక్రెట్స్ ను చెప్పుకొచ్చారు.

Telugu Balakrishna, Liquor Habit, Nanibalakrishna, Venkatesh-Movie

హాలీవుడ్ లో క్లాసిక్ గా నిలిచిన గాడ్ ఫాదర్ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తే ఆ సినిమాలో బ్రాండో పాత్రలో బాలకృష్ణ అల్ పాచనో పాత్రలో తాను నటిస్తే బాగుంటుందని నాని కామెంట్లు చేశారు.ఈ షో మూడో ఎపిసోడ్ కు వెంకటేష్ గెస్ట్ గా హాజరు కానున్నారని తెలుస్తోంది.

Telugu Balakrishna, Liquor Habit, Nanibalakrishna, Venkatesh-Movie

బాలకృష్ణ వెంకటేష్ తో ఎలాంటి సీక్రెట్స్ ను చెప్పిస్తారో చూడాల్సి ఉంది.ఎన్టీఆర్ కూడా ఈ షోకు వస్తారని ప్రచారం జరుగుతున్నా ఆ ప్రచారంలో నిజం లేదని తెలుస్తోంది.బాలయ్య షోకు ఎన్టీఆర్ రావాలని అభిమానులు మాత్రం కోరుకుంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube