ఈ రాజాచారి ఇప్పుడు తెలుగు వారంద‌రికీ గ‌ర్వ‌కార‌ణం.. విష‌యం ఏంటంటే

స్పేస్‌లోకి వెళ్ల‌డం అనేది నిజంగా ఒక వండ‌ర్ అనే చెప్పాలి.ఎందుకంటే ఇది ఎవ‌కిరి ప‌డితే వారికి సాధ్య‌మ‌య్యే ప‌ని కాదు.

 This Rajachari Is Now A Source Of Pride For All The Telugu People .. The Thing I-TeluguStop.com

కేవ‌లం కొంద‌రికి మాత్ర‌మే అది వీలవుతుంది.ఇక‌పోతే ఇప్పుడు ఇలాంటి ప‌రిశోధ‌న‌ల కోసం స్పేస్ లోకి వెళ్తున్న వారి సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది.

కేవలం సైంటిస్టులు మాత్ర‌మే కాకుండా ఈ మ‌ధ్య మామూలు మ‌నుషులు కూడా స్పేస్ లోకి వెళ్లి వ‌స్తున్నారు.ఈ క్ర‌మంలోనే ఓ తెలుగు వ్య‌క్తి ఇప్పుడు ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారంద‌రికీ గ‌ర్వ కార‌ణంగా మారిపోయారు.

ఆయ‌నెవ‌రో కాదు రాజాచారి.

ఇప్పుడు ప్ర‌పంచ కుబేరుడు అయిన ఎల‌న్ మ‌స్క్‌కు చెందిన కంపెనీ రీసెంట్ గా ఓ టీమ్‌ను అంత‌రిక్షంలోకి పంపించింది.

అయితే ఆ టీమ్ కు నేతృత్వం వహిస్తుంది మ‌న తెలుగు వ్య‌క్తి.ఆయ‌నే 44 ఏండ్ల‌ రాజాచారి అని ఇప్ప‌టికే నిర్వాహ‌క కంపెనీ అధికారికంగా ప్ర‌క‌టించింది.అయితే అత‌నికి ఎలాంటి అనుభ‌వం లేక‌పోయినా కూడా ఇలా నేతృత్వం వ‌హించ‌డం ఇదే మొద‌టిసారి.అయ‌తే రాజాచారికి చాలా ప్ర‌త్యేక‌మైన అనుభ‌వాలు ఉన్నాయి.

రాజాచారి ఫైటర్ జెట్ విమానాల‌ను అత్య‌ద్భుతంగా చాలా ఎక్కువ సేపు న‌డిపిన వ్య‌క్తిగా అనుభ‌వం ఉంది.

Telugu America, Elon Musk, Hyderabad, Mahabub Nagar, Rajacharai, Rajachari, Spac

అత‌ను 2500 గంటల వ‌ర‌కు ఫైట‌ర్ జెట్‌ను న‌డిపిన‌ అనుభవం సొంతం చేసుకున్నాడు.రాజాచారి మూలాలు మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్నాయి.ఆయ‌న తాత‌లు ఈ జిల్లాలోనే ఉండేవారు.

ఇక రాజాచారి ఫ్యామిలీ త‌న తాత హ‌యాంలోనే హైద‌రాబాద్ కు వ‌చ్చి సెటిల్ అయ్యింద‌ని స‌మాచారం.రాజాచారి తండ్రి శ్రీనివాసాచారి ఓయూ యూనివ‌ర్సిటీలో చ‌దువ‌కుని ఆ త‌ర్వాత అమెరికా వెళ్లి అక్క‌డే స్థిర‌ప‌డ్డారు.

అమెరికాకు చెందిన పెగ్గీ ఎగ్బర్ట్ ను ఆయ‌న వివాహం చేసుకున్నారు.ఇప్ప‌టికే ఆయ‌న అమెరికా వాయుసేనలో కూడా ప‌నిచేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube