ఆ ప్రాంతంలో 100 సంవత్సరాలు జీవించడం సహజమట..ఎందుకంటే..?

ఈ కాలంలో 100 సంవత్సరాలుబతకడం మాట పక్కన పెడితే అసలు60 సంవత్సరాలకేరోజులు వెళ్ళబెట్టేస్తున్నారు.ఎక్కడో ఒక చోట మాత్రమే కొంతమంది సెంచరీ వయసు దాటి రికార్డు సృష్టిస్తున్నారు.

 It Is Natural To Live In That Area For 100 Years Because 100 Years, Uk, Living,-TeluguStop.com

ప్రస్తుత కాలంలో సెంచరీ కొట్టడం అంటే మాములు విషయం కాదు.మన మామ్మలు, తాతలు మాత్రమే నూరేళ్ళ ఆయిష్షుతో బతుకేస్తున్నారు.

మన తరం వాళ్ళు అరవై, డెబ్భై ఏళ్లకే జీవితాన్ని ముంగించేస్తున్నారు.శరీరానికి తగిన వ్యాయామం లేకనో, మనం తినే తిండి విషయంలో మార్పులు, దురలవాట్లు, మారుతున్న జీవనశైలి ఇలా రకరకాల కారణాల వలన అర్ధాంతరంగా సగం కాలంలోనే లేని పోనీ అనారోగ్యాలు కొని తెచ్చుకుని చనిపోతున్నారు.

అప్పట్లో 100 ఏళ్ళు బతికాడు అంటే అది సర్వసాదరణమైన విషయం.కానీ ఇప్పుడు ఎవరన్నా 100 ఏళ్ళు బతికితే ఆశ్చర్యపోతున్నారు.

అలా మారిపోయింది మనిషి జీవిత కాలం.

ఈ క్రమంలోనే మీకు ఒక గ్రామంలోని ప్రజల గురించి చెప్పాలి.

ఎందుకంటే ఆ గ్రామంలో నివసించే ప్రజలు వందేండ్ల పాటు బతికి సెంచరీ బర్త్ డేలు కూడా జరుపుకుంటూ ఉంటారు.ఆ గ్రామంలో ఇలాంటి సెంచరీ పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం కొత్తేమి కాదట.

మరి ఇంతకీ ఆ గ్రామం పేరు ఏంటి.ఎక్కడ ఉంది.

ఎందుకని ఆ గ్రామ ప్రజలు అన్ని సంవత్సరాలు బతుకి ఉంటున్నారు అనే విషయాలు తెలుసుకుందామా.

Telugu Latest Ups, Latest-Latest News - Telugu

యూకేలో ఉన్నడెట్లింగ్అనే ఒక చిన్న గ్రామంలో నివసించే ప్రజల వయసు దాదాపు 100 ఏళ్ళు దాకనే ఉంటుంది.ఎక్కువ వయసు ప్రజలు ఉన్న గ్రామంగా డెట్లింగ్ యూకేలో రికార్డు కూడా సంపాదించుకుంది.అక్కడ నివసించే ప్రజల సగటు వయసు మిగతా ప్రజలతో పోలిస్తే 12 సంవత్సరాలు ఎక్కువగానే ఉంటుంది.

అక్కడి గ్రామంలోని ప్రజలు చాలమంది వందేండ్లకు పైగానే బతుకుతుంటారు.అక్కడ ఇలా సెంచరీ బర్త్ డేలు చేసుకోవడం మాకు అలవాటు అయిపొయింది అని డెట్లింగ్ గ్రామ ప్రజలు చెబుతుంటారు.

అసలు ఈ గ్రామంలో ప్రజలు ఎక్కువ కాలం జీవించడానికి కారణం తెలిస్తే మీరే ఆశ్చర్య పోతారు.

Telugu Latest Ups, Latest-Latest News - Telugu

ఎందుకంటే అక్కడి ప్రజలు అన్ని సంవత్సరాలు జీవించడానికి గల కారణం ఏంటంటే వాళ్లు పాటించే ఆరోగ్యకరమైన అలవాట్లేనటఇక్కడి గ్రామ ప్రజలు పూర్తిగా ధూమపానాన్నినిషేధించారు.అసలు ఎవరు కూడా ఇంట్లో గాని, వీధిలో గాని సిగరెట్లు తాగరట.అలాగే వారి మంచి నీళ్లూ, ఆరోగ్యకరమైన ఆహారాన్ని మాత్రమే తీసుకుంటారుమనలా పిజ్జాలు, బర్గర్లు వంటి ఫాస్ట్ ఫుడ్ ఐటమ్స్ గురించి వాళ్ళకి తెలియదు.ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆ గ్రామంలో మొత్తం 800 మంది జనాభా మాత్రమే నివసిస్తున్నారు.100 కి ఒకరికి చొప్పున 800 మంది ప్రజలకు వైద్య సేవల కోసం కేవలం ఎనిమిది మంది డాక్టర్లేఉన్నారట.ప్రతి విషయంలోనూ డెట్లింగ్ గ్రామ ప్రజలు జాగ్రత్తలు పాటించడం వలన మిగిలిన వారితో పోలిస్తే ఎక్కువ రోజులు పాటు జీవనాన్ని కొనసాగిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube