తక్కువ బడ్జెట్ తో తక్కువ రోజుల్లో సినిమాలను తెరకెక్కించి ఆ సినిమాలతో సక్సెస్ సాధించి సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా మారుతి గుర్తింపును సొంతం చేసుకున్నారు.దీపావళి కానుకగా మారుతి దర్శకత్వం వహించిన మంచి రోజులు వచ్చాయి సినిమా భారీ అంచనాలతో నిన్న రిలీజ్ కాగా ఈ సినిమాకు నెగిటివ్ టాక్ వచ్చింది.
మొదట మంచి రోజులు వచ్చాయి సినిమాతో మరో డైరెక్టర్ ను పరిచయం చేద్దామని భావించిన మారుతి తరువాత తన నిర్ణయాన్ని మార్చుకున్నారు.
ప్రతిరోజూ పండగే సినిమాతో సక్సెస్ సాధించిన మారుతి మంచి రోజులు వచ్చాయి సినిమాకు నెగిటివ్ టాక్ రావడంతో ఆ ఇమేజ్ ను కొంతవరకు తగ్గించుకున్నారు.
మంచి రోజులు వచ్చాయి సినిమా ఫలితం ప్రభావం మారుతి తర్వాత సినిమా పక్కా కమర్షియల్ పై పడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి.గతంలో మారుతి డైరెక్షన్ లో సుధీర్ బాబు, నందిత హీరోహీరోయిన్లుగా ప్రేమకథాచిత్రమ్ అనే సినిమా తెరకెక్కింది.
ఆ సినిమా ప్రయోగాత్మక సినిమా కావడంతో మారుతి తన పేరును కాకుండా మరో వ్యక్తి పేరును ఆ సినిమాకు దర్శకుడిగా వేశారు.
అయితే ఆ సినిమా సక్సెస్ సాధించిన తర్వాత తనే ప్రేమకథాచిత్రమ్ ను డైరెక్ట్ చేశానని మారుతి తెలిపారు.అయితే మంచి రోజులు వచ్చాయి సినిమా మాత్రం నెగిటివ్ ఫలితాన్ని అందుకోవడం మారుతికి మైనస్ అవుతోంది.దర్శకుడు మారుతి తర్వాత హీరోల జాబితాలో మెగాస్టార్ చిరంజీవి కూడా ఉన్నారు.
పక్కా కమర్షియల్ సక్సెస్ సాధించకపోతే మెగాస్టార్ మారుతి కాంబో మూవీపై ఆ ప్రభావం పడే అవకాశం ఉంది.మారుతి చిన్న సినిమాలకు దూరంగా ఉండాలని ఆయన ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.మారుతి దర్శకత్వం వహిస్తున్న పక్కా కమర్షియల్ మూవీ వచ్చే ఏడాది రిలీజ్ కానుందని తెలుస్తోంది.