మన హిందూ సాంప్రదాయాల ప్రకారం ఏదైనా అమ్మవారి ఆలయానికి వెళ్ళినప్పుడు అక్కడ అమ్మవారి చీరల వేలం వేస్తుంటారు.ఈ క్రమంలోనే చాలామంది ఆ చీరలను కొనుగోలు చేయడానికి సందేహం వ్యక్తం చేస్తుంటారు.
అమ్మ వారి వస్త్రాలను మనం ధరించవచ్చా? ధరించడం వల్ల ఏ విధమైనటువంటి ఫలితాలు కలుగుతాయో అని చాలామంది సందేహాలను వ్యక్తం చేస్తుంటారు.ఈ క్రమంలోనే మన ఇంటిలో కూడా చాలామంది ఏదైనా వ్రతాలు పూజలు చేస్తున్న సమయంలో అమ్మవారికి చీర సమర్పిస్తాము.
ఇలా సమర్పించిన చీరను ఏ సమయంలో కట్టుకోవాలి ఎప్పుడు కట్టుకోకూడదు అనే సందేహాలు తలెత్తుతుంటాయి.మరి అమ్మవారి చీరలు ఎప్పుడు కట్టుకోవాలి కట్టుకోవడం వల్ల ఏ విధమైనటువంటి ప్రయోజనాలు కలుగుతాయి అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
సాధారణంగా అమ్మవారికి సమర్పించిన చీరలను అమ్మవారి ప్రసాదంగా స్వీకరిస్తారు.ఈ చీరలను కట్టుకోవడం వల్ల ఎంతో శుభం జరుగుతుందని పండితులు చెబుతున్నారు.
అయితే ఈ చీరలను సాధారణ రోజులలో కట్టుకోకూడదని అలాగే ఎక్కడికైనా ప్రయాణాలు చేస్తున్న సమయంలోనూ శుభకార్యాలు జరుగుతున్న సమయంలో ధరించకూడదని పండితులు చెబుతున్నారు.ఇలా అమ్మవారికి సమర్పించిన చీరలను కేవలం ఏదైనా గుడికి వెళ్లే సమయంలో లేదా మన ఇంట్లో పూజలు, వ్రతాలు చేస్తున్న సమయంలో మాత్రమే ధరించాలని ఇలా ధరించినప్పుడు మాత్రమే మనకు అమ్మ వారి ఆశీస్సులు కలిగి శుభం కలుగుతుందని పండితులు చెబుతున్నారు.
ముఖ్యంగా అమ్మవారికి సమర్పించిన చీరలను తీసుకున్న తర్వాత వాటిని ఇతరులకు దానం చేయకూడదు.అదేవిధంగా అమ్మవారికి సమర్పించిన చీరలు కట్టుకొని స్త్రీలు పడకగదికి వెళ్ళకూడదు.కేవలం చీరలు మాత్రమే కాకుండా మనం ఏదైనా పూజా కార్యక్రమాలకు వెళ్ళినప్పుడు.అక్కడ తాంబూలంలో ఇచ్చే రవికను సైతం ప్రసాదంగా భావించి వాటిని ధరించినప్పుడు కూడా ఈ విధమైనటువంటి నియమాలను పాటించాలని పండితులు తెలియజేస్తున్నారు.