ఆఫ్ఘనిస్తాన్ తాలిబన్ల వశమయ్యింది, ఇక అక్కడ నడిచేది తాలిబాన్ల క్రూరాతి క్రూరమైన రాజ్యమే.అక్కడి ప్రజలు బిక్కు బిక్కు మంటూ కాలం గడపాల్సిందే.
ఇదే వారి భవిష్యత్తు.కానీ అందుకు కారణం తాలిబన్లు కాదు కనీస ఆలోచన లేకుండా తమ బలగాలను వెనక్కి తీసుకున్న బిడెన్.
ఇది మనం చెప్పే మాట కాదు యావత్ ప్రపంచం మొత్తం కోడై కూస్తోంది.చివరికి అమెరికా ప్రజలు కూడా బిడెన్ నిర్ణయాన్ని హర్షించడం లేదు.
ఇలాంటి చెత్త నిర్ణయం బిడెన్ తీసుకుంటాడా అంటూ విద్యా వేత్తలు, రాజకీయ ఉద్దండులు, మానవతా వాదులు మండిపడుతున్నారు.ఇక నిన్నటి వరకూ ఆహా ఓహో అంటూ బిడెన్ ను ఆకాశానికి ఎత్తేసిన దిగ్గజ మీడియా సైతం దుమ్మెత్తి పోస్తోంది.
అమెరికా అధ్యక్షుడిగా చాలా క్లీన్ గా రిటైర్ అవ్వాల్సిన బిడెన్ ఇంత పెద్ద అపవాదును ఎందుకు మూటగట్టుకున్నాడు అంటూ విమర్శలు ఎక్కుపెడుతున్నారు.
ప్రముఖ వ్యాపార దిగ్గజ పత్రిక వాల్ స్ట్రీట్ జర్నల్ ఆఫ్హన్ లోని తాలిబన్ల కు బిడెన్ లొంగి పోయాడు అంటూ ఘాటైన వ్యాఖ్యలు రాసింది.
ఇక మరో ప్రముఖ ఛానెల్ అయితే బిడెన్ జీవితంలో ఇది అత్యంత చెత్త ఓటమి, అధ్యక్షుడిగా బిడెన్ అతిపెద్ద అపవాదు మూటగట్టుకున్నాడని రాసుకొచ్చింది.ఇక న్యూయార్క్ టైమ్స్ అయితే ఇది ఎంతో సిగ్గుపడే సంఘటన, ఓ దేశానికి అండగా ఉంటూ వారిని నమ్మించి నట్టేట ముంచేస్తారా అంటూ మండిపడింది.
మరో ప్రఖ్యాత పత్రిక ది గార్డియన్ మాత్రం కొంచం ఘాటుగానే స్పందించిన బిడెన్ పాలనలో ఇది అతి చెత్త అధ్యాయం.పెద్దన్న గా చెప్పుకునే అమెరికాకు ఇది హోరమైన అవమానం, ఇది ముమ్మాటికి బిడెన్ ఘోరమైన ఓటమి అంటూ రాసుకొచ్చింది.
తమ బలగాలను వెనక్కి తీసుకుంటే బిడెన్ తనకు ఖ్యాతి వస్తుందని భావించారు కాబోలు కానీ ఇప్పుడు పరిస్థితులు బిడెన్ కు అనుకూలంగా లేవని ఇది ఓ సిగ్గుమాలిన పని అంటూ బారమైన పదాలతో చీల్చి చెండాడింది.ఇలా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పత్రికలు అన్నీ బిడెన్ పై ముప్పేట దాడి చేశాయి.
మరి బిడెన్ తాను చేసిన పనిని ఎలా సమర్ధించుకుంటారో, ఎలాంటి సంజాయిజీ తెలియజేస్తారో వేచి చూడాలి.